Movie News

నిర్మాతల నిర్ణయాలకు హీరోలు నిందలు మోస్తున్నారు

సంక్రాంతి వస్తోందంటే మన బాక్సాఫీస్ దగ్గర ఎంత పోటీ ఉంటుందో.. థియేటర్ల కోసం ఎలాంటి గొడవలు నడుస్తాయో తెలిసిందే. అటు తమిళంలో కూడా సంక్రాంతి క్రేజీ సీజనే. అక్కడ కూడా సినిమాల మధ్య విపరీతమైన పోటీ, థియేటర్ల కోసం గొడవలు కామనే. ఐతే తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ కాబట్టి తెలుగులో మాదిరి మరీ ఎక్కువ సినిమాలు రిలీజ్ కావు. రెండు మూడు చిత్రాలకు పరిమితం అవుతుంటాయి.

విజయ్, అజిత్, రజినీకాంత్ సినిమాలు పోటీలో ఉంటే.. వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడతారు. ఈసారి సంక్రాంతికి విజయ్ చిత్రం ‘జననాయగన్’ రిలీజవుతోంది. మామూలుగానే విజయ్ సినిమా అంటే భయం. పైగా ఇది అతడి చివరి చిత్రం. దీనికి మామూలు హైప్ లేదు. అందుకే ముందు పోటీకి సై అన్న కొన్ని చిత్రాలు వెనక్కి తగ్గాయి. కానీ శివకార్తికేయన్ హీరోగా సుధ కొంగర రూపొందించిన ‘పరాశక్తి’ సినిమా మేకర్స్ మాత్రం వెనుకంజ వేయలేదు.

‘జననాయగన్’ సినిమా జనవరి 9న రిలీజ్ కానుండగా.. ఆ చిత్రానికి ఐదు రోజుల ఖాళీ వదిలేసి జనవరి 14న ‘పరాశక్తి’ని రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ థియేటర్లతో అగ్రిమెంట్ల విషయంలో ‘జననాయగన్’ మేకర్స్ స్వార్థపూరితంగా వ్యవహరించారని తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వారం, అంతకంటే ఎక్కువ రోజులకు అగ్రిమెంట్లు చేసుకోవడం మొదలుపెట్టారు.

దీంతో ‘పరాశక్తి’కి 14న కూడా చాలినన్ని థియేటర్లు దొరకడం కష్టమవుతుందని దాని నిర్మాతలకు అర్థమైంది. దీంతో విజయ్ సినిమా వచ్చిన తర్వాతి రోజే తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. థియేటర్ల కోసం వారి స్థాయిలో వాళ్లు లాబీయింగ్ మొదలుపెట్టారు.

ఐతే విజయ్ చివరి చిత్రం రిలీజవుతుండగా.. దానికి ఖాళీ వదలకుండా తర్వాతి రోజే ‘పరాశక్తి’ని రిలీజ్ చేయడమేంటి.. విజయ్ మీదికే పోటీకి వెళ్లేంత పెద్దోడివి అయిపోయావా అంటూ శివకార్తికేయన్ మీదికి దళపతి ఫ్యాన్స్ దండెత్తుతున్నారు. కానీ మొత్తం థియేటర్లను తామే ఆక్యుపై చేయాలని విజయ్ సినిమా మేకర్స్ చూడడం మీద అటు నుంచి విమర్శలు వస్తున్నాయి.

తమకు 14న చాలినన్ని థియేటర్లు దొరికేలా చూసి ఉంటే ఇలా పోటీకి వచ్చేవాళ్లం కాదన్నది వారి మాట. కంటెంట్ మీద ధీమాగా ఉన్న ‘పరాశక్తి’ టీం.. విజయ్ సినిమాతో పోటీ పడి గెలవగలమని, రిలీజ్ తర్వాత తమ సినిమాకు స్క్రీన్లు, షోలు పెంచక తప్పని పరిస్థితి ఉంటుందని.. విజయ్ మూవీకి తమ నుంచే ముప్పు ఉందనే ధీమాను అంతర్గతంగా వ్యక్తం చేస్తోంది. కోలీవుడ్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. మరి థియేటర్ల విషయంలో ఈ రెండు చిత్రాల మేకర్స్ ఏమేర సర్దుబాటు చేసుకుంటారో చూడాలి.

ఒక పక్క విజయ్ కు శివ కార్తికేయన్ ఎంత పెద్ద విధేయుడో అందరికీ తెలిసిన విషయమే. గత ఏడాది వచ్చిన విజయ్ గోట్ సినిమాలో శివ కార్తికేయన్ మంచి క్యామియో చేసినప్పుడు విజయ్ ఫ్యాన్స్ అతన్ని ఎంత కొనియాడారో గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు నిర్మాతల నిర్ణయాలకు హీరోలు నిందలు మోస్తున్నారనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఎంత పోటీ వచ్చినా ఎవరి కెపాసిటీ వాళ్ళదే కాబట్టి ఈ ఫ్యాన్ వార్స్ అప్రస్తుతం అని సినీ పెద్దలు చెబుతున్నారు.

This post was last modified on December 30, 2025 1:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డబుల్ ట్రీట్ ఇవ్వనున్న శర్వానంద్

నారి నారి నడుమ మురారి సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న శర్వానంద్ మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ తనకు…

4 hours ago

వర ప్రసాద్ గారు… అందరి రేట్లు పెరిగినట్లే

సంక్రాంతి బరిలో నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డ్ కలెక్షన్లు మేకర్స్ కి మంచి బూస్ట్…

5 hours ago

లోకేష్ పుట్టిన రోజు.. ఓ మంచి పని

టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల…

5 hours ago

90 రోజుల కండీషన్ – టాలీవుడ్ టెన్షన్ టెన్షన్

టాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించిన చర్చే కనిపిస్తోంది. ఇకపై రాష్ట్రంలో టికెట్ ధరలు…

5 hours ago

సూర్య దుల్కర్ భలే తప్పించుకున్నారు

పొంగల్ పండగ సందర్భంగా సెన్సార్ వివాదాలను ఎదురుకుని తమిళంలో విడుదలైన పరాశక్తి ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పేరుకు వంద…

6 hours ago

ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది.…

6 hours ago