ఒకప్పుడు వివిధ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగింది తమన్నా. కానీ కొన్నేళ్లుగా ఆమె ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఒకప్పుడంటే ఈ స్పెషల్ సాంగ్స్ కోసమే వేరే భామలు ఉండేవాళ్లు. కానీ తర్వాత ట్రెండు మారి.. స్టార్ హీరోయిన్లే ఈ పాటలు చేస్తున్నారు. ఈ ట్రెండుకు ఊపు తెచ్చిన హీరోయిన్లలో తమన్నా ఒకరు.
పదేళ్ల ముందు టాప్ హీరోయిన్‌గా ఉండగానే ‘అల్లుడు శీను’లో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. గత దశాబ్ద కాలంలో ఇండియన్ సినిమాలో అత్యధికంగా ఐటెం సాంగ్స్ చేసిన ఘనత మిల్కీ బ్యూటీకే దక్కుతుంది. గత ఏడాది ‘స్త్రీ-2’లో తమ్మూ చేసిన సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
ప్రస్తుతం బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’లో కూడా తమన్నానే ఐటెం సాంగ్ చేయాల్సిందట. కానీ ఏవో కారణాలతో ఆ పాటను క్రిస్టల్ డిసౌజా చేసింది. ఇంకొకరి అవకాశాన్ని తాము తీసుకున్నపుడు.. ఆ ఇంకొకరి గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. పాజిటివ్ కామెంట్స్ చేయరు. కానీ క్రిస్టల్ డిసౌజా మాత్రం తమన్నా మీద ప్రశంసలు కురిపించింది.
ఆమె ఈ పాట చేస్తే ఇంకా బాగుండేదని పేర్కొంది.
‘‘శరరత్ పాట ఎంపికలో తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ పాటలో ఆయేషా ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు రాసి ఉన్నదే మనకు సొంతమవుతుందని నమ్మతాను. ఈ పాట నాకు రాసి ఉంది. తమన్నా గొప్ప నటి. డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. ఒకవేళ ఆమె ఆ పాట చేసి ఉంటే ఇంకా బాగుండేది. తన మ్యాజిక్‌తో ఆ పాటకు మరింత అందాన్ని జోడించేవారు. ఆమెను చూసి ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎంతో గర్విస్తారు. ఇండస్ట్రీలోని హీరోయిన్లందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని క్రిస్టల్ పేర్కొంది.
This post was last modified on December 29, 2025 1:20 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…