ప్రభాస్ కొత్త సినిమా ‘రాజాసాబ్’ ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ ఏడాది చివరికి వాయిదా వేశారు. అయితే కొత్త డేట్ అయిన డిసెంబరు 5కు కూడా సినిమా రాలేదు. తర్వాత సంక్రాంతి సీజన్‌కు రిలీజ్ ఖరారైంది. పండక్కి ముందుగా రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఐతే సినిమా ఇన్నిసార్లు వాయిదా పడినా.. రిలీజ్ ఇంత ఆలస్యమైనా ఇంకా చివరి నిమిషంలో హడావుడి తప్పట్లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిలీజ్ ముంగిట ప్రమోషన్లు సరిగా లేవని అభిమానులు ఫీలవుతుంటే.. వారిని మరింత అసహనానికి గురి చేసే పరిణామాలు జరుగుతున్నాయి. ‘రాజాసాబ్’ రిలీజ్‌కు మూడు నెలల ముందే ఒక ట్రైలర్ వదిలింది చిత్ర బృందం. ఐతే విడుదల ముంగిట ఇంకో ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకు ప్రి రిలీజ్ ఈవెంటే వేదికగా భావించారు.
కానీ ఆ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేయలేకపోయారు. మరుసటి రోజు ట్రైలర్ వస్తుందని ప్రభాస్ ఆ ఈవెంట్లో ప్రకటించాడు. తీరా చూస్తే ఆదివారం కూడా ట్రైలర్ రాలేదు. కనీసం ట్రైలర్ వాయిదా పడుతోందని కానీ, ఏ టైంకి వస్తుందని కానీ టీం సమాచారం ఇవ్వలేదు. మరి సోమవారమైనా ట్రైలర్ రిలీజవుతుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్న సినిమాకు గట్టిగా ప్రమోషన్లు చేయాలని అభిమానులు కోరుకుంటుంటే.. టీం ఆ విషయంలో చురుగ్గా వ్యవహరించట్లేదు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలైనట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రభావం ప్రమోషన్ల మీదా పడుతోంది. ట్రైలరే చెప్పిన టైముకి రిలీజ్ చేయకపోతే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో అన్న కంగారు కూడా కలుగుతోంది అభిమానులకు.
This post was last modified on December 29, 2025 1:00 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…