కన్నడ సినిమా టాప్ స్టార్లలో కిచ్చా సుదీప్ ఒకడు. అతడికి వేరే భాషల్లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ‘ఈగ’ సహా కొన్ని సినిమాల్లో నటించి తెలుగులో బాగానే గుర్తింపు సంపాదించాడు. హిందీలో కూడా అతను కొన్ని సినిమాల్లో నటించాడు. కన్నడనాట సుదీప్‌కు పెద్ద మార్కెట్టే ఉంది.
అతను కన్నడలో అయినా.. మరో భాషలో అయినా.. ఏదైనా ప్రత్యేక పాత్ర చేయాలంటే ఉత్సాహంగా ముందుకు వస్తాడు. హీరోగానే కాక విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తాడు. అలాంటి నటుడు.. తన సినిమాలో క్యామియో చేయడానికి వేరే భాషల నుంచి ఎవ్వరూ ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సుదీప్ మాత్రమే కాక శివరాజ్ కుమార్, ఉపేంద్ర సైతం ఇతర భాషల్లో క్యామియోలు చేస్తుంటారు. కానీ తాము ఇతర భాషలకు వచ్చి ప్రత్యేక పాత్రల్లో నటించినట్లు.. కన్నడ సినిమాల కోసం ఇతర భాషల వాళ్లు ముందుకు రావడం లేదని సుదీప్ ఆవేదన చెందాడు. తాను చాలా సినిమాల్లో డబ్బులు కూడా తీసుకోకుండా క్యామియోల్లో నటించానని.. కానీ తాను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసినా సరే.. తమ సినిమాల్లో నటించేందుకు ముందుకు రాలేదని.. ఇక్కడ పరస్పర సాయం అనేది లోపిస్తోందని సుదీప్ అన్నాడు.
సుదీప్ నుంచి క్రిస్మస్ కానుకగా ‘మార్క్’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలో క్యామియోల కోసం వేరే భాషల హీరోలను సుదీప్ అడిగితే చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. ‘మార్క్’ సినిమాకు రివ్యూలు మిక్స్డ్‌గా వచ్చాయి. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ.. అది బాక్సాఫీస్ దగ్గర నిలబడేలా కనిపించడం లేదు
This post was last modified on December 27, 2025 11:07 pm
రాజమౌళి కెరీర్ను ‘మగధీర’కు ముందు, ‘మగధీర’కు తర్వాత అని విభజించి చూడాలి. ‘మగధీర’కు ముందు వరకు ఆయన సగటు మాస్…
ప్రభాస్తో పని చేసే ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ తన పెద్ద మనసు గురించి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కడుపు పగిలేలా…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు శాశ్వతంగా సెలవు చెప్పేశాడు. ఇకపై ప్రజాసేవ కోసం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగేందుకు…
ఏపీలో జిల్లాల విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ,…
ఏపీ రాజకీయాల్లో పార్టీ చీఫ్గా పురాతన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ…
కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం…