ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కోట్లు సంపాదించినా, లక్షల అభిమానులను వెనక నిలుపుకున్నా దానికి ప్రధాన కారణం ప్రేక్షకులే. వాళ్ళు థియేటర్లకు రాకపోతే ఎవరికీ ఫుడ్ ఉండదు. అందుకే ఆడియన్స్ ని దేవుళ్లుగా భావిస్తారు హీరోలు, నిర్మాతలు.
కానీ ప్రకాష్ రాజ్ ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయారు. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో టికెట్ రేట్ల పెంపు గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు సినిమాలు ఎవరు చూడమన్నారు, మానేయండి, ఎవరి వ్యాపారం వారిదని పెద్ద కామెంట్ చేశారు. చాలా క్యాజువల్ గా మీరు చూడకపోతే మాకేం పోదు అన్న ధోరణిలో మాట్లాడారు.
ఆడియన్స్ అనే మహారాజ పోషకులు లేకపోతే వినోద పరిశ్రమ ఎప్పుడో కూలిపోయేది. సంపాదించే నాలుగు రూపాయల్లో ఒక్క రూపాయి కేవలం సినిమాలు చూసేందుకు పెట్టే జనాలు లక్షలు కాదు కోట్లలో ఉన్నారు. ఉదాహరణకు అమెరికా, యుకెలో ఉన్న వాళ్ళందరూ రేట్లు ఎక్కువ ఉన్నాయని టికెట్లు కొనడం మానేస్తే ప్రొడ్యూసర్ కు వచ్చే నష్టం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది.
అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో ఓజి, అఖండ 2 లాంటి వాటికి ప్రీమియర్ షో వద్దనుకుంటే నిర్మాత ఎంత నష్టపోతాడో వేరే చెప్పాలా. పెద్ద సినిమాలే కాదు కోర్ట్, రాజు వెడ్స్ రాంబయి లాంటి చిత్రాలకు ఊపిరి పోసింది ఓటిటిలు కాదు, టికెట్లు కొన్న జనాలు.
అంతెందుకు ఇదే ప్రకాష్ రాజ్ కు ఇచ్చే రెమ్యునరేషన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. నిర్మాత జేబులని నింపే ప్రేక్షకుల పర్సులు నుంచే కదా. ఎవరి వ్యాపారం వారిది. నిజమే. కానీ ఇది అంత ఈజీగా ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీకి వర్తించదు. ఎందుకంటే సినిమా అనేది కస్టమర్లకు ఒక ఆప్షన్ మాత్రమే. కంపల్షన్ కాదు.
ఓ సంవత్సరం పాటు సినిమా చూడకపోతే ప్రాణానికి ఏమి కాదు. కానీ రెండు రోజులు భోజనం మానేస్తే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఇది మర్చిపోయి నిర్లక్ష్యంగా ఎవరు చూడమన్నారు అనడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ప్రకాష్ రాజ్ ఏ ఉద్దేశంతో అన్నా సరే అపార్థమయ్యే అర్థం ఇందులో చాలా ఉంది.
This post was last modified on December 27, 2025 8:23 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…