మాములుగా స్టార్ హీరోలు తమ వయసు ఎంత ఉన్నా చిన్న ఈడు హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్స్, డ్యూయెట్స్ కోరుకోవడం సహజం. ఇప్పుడే కాదు దశాబ్దాల వెనుక ఏఎన్ఆర్-ఎన్టీఆర్ శ్రీదేవితో స్టెప్పులు వేసినప్పటి నుంచి రవితేజ, శ్రీలీల జోడీని జనం ఆదరించే దాకా ఎన్నో ఉదాహరణలున్నాయి.
కానీ ఏజ్ కు తగ్గట్టు ఎంచుకోవడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. వెంకటేష్ ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. దృశ్యంలో టీనేజ్ అమ్మాయి తండ్రిగా కనిపించేందుకు వెనుకాడలేదు. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కు లవ్ సాంగ్స్ ఉండవు. ఇప్పుడు సూర్య ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఎంటర్ టైనర్ లో బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పటిదాకా బయటికి రాలేదు. మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ దాన్ని ఓపెన్ చేశారు.
సూర్య తో తాము తీస్తున్న సినిమాలో 45 వయసున్న ఒక వ్యక్తికి, 20 ఏళ్ళ అమ్మాయికి మధ్య జరిగే పరిచయం, స్నేహం, ఎమోషన్, ప్రేమ వగైరా అంశాల చుట్టూ చాలా టచింగ్ గా ఉంటుందని అన్నారు. అంటే సూర్య, మమిత బైజు మధ్య ఆన్ స్క్రీన్ వ్యత్యాసం పాతిక సంవత్సరాలన్నమాట. ఇంత ఏజ్ డిఫరెన్స్ తో స్టార్ హీరోలు సినిమాలు చేసిన దాఖలాలు చాలా తక్కువని చెప్పాలి.
2026 వేసవి విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకొద్దిరోజులు మాత్రమే బాలన్స్ ఉంది. కరుప్పు విడుదల తేదీ నిర్ణయించడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల దాని ప్రభావం సూర్య 45 మీద పడుతోంది. టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
సార్, లక్కీ భాస్కర్ ఇలా వరస బ్లాక్ బస్టర్లతో దూకుడు మీదున్న వెంకీ అట్లూరితో సితార సంస్థ హ్యాట్రిక్ ఆశిస్తోంది. ఈ మధ్య తనకు సూటయ్యే కథలకు దూరంగా ఉంటూ కంగువ లాంటి డిజాస్టర్ ప్రయోగాలు చేసిన సూర్య మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కరుప్పు సంగతేమో కానీ వెంకీ మాత్రం హిట్టు ఇచ్చే లక్షణాలు ఉన్నాయి.
This post was last modified on December 27, 2025 12:24 pm
మూడేళ్లకు పైగా సమయాన్ని కేవలం ఒక్క సినిమా కోసమే వెచ్చించిన రోషన్ మేకకు ఛాంపియన్ రూపంలో ఫలితం వచ్చేసింది. యునానిమస్…
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రంగా ఖండించారు.…
కొన్ని సినిమాలు విడుదలకు ముందు నిర్మాతల్లో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ చూపిస్తాయి. గ్యారెంటీ హిట్టు కొడతామనే నమ్మకాన్ని బయట పెడతాయి.…
మరో నాలుగు రోజుల్లో క్యాలెండర్ మారుతోంది. 2025కు గుడ్‌బై చెబుతూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నాం. ఈ నేపథ్యంలో గడిచిన…
ఈ నెల రెండో వారంలో రిలీజైన మోగ్లీ సినిమా మీద టీం అంతా చాలా ఆశలే పెట్టుకుంది. ఇది తొలి…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి 2025లో ఏం జరిగింది? 2023లో ఎదురైన పరాభవం, పరాజయం తర్వాత పార్టీ…