Movie News

సంగీత దర్శకుడిని మోసం చేయడం దారుణం

సోషల్ మీడియాలో ఫలానా ఆపద వచ్చిందని సెలబ్రిటీల సహాయం కోరేవాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళు చెప్పుకున్న బాధ నిజమో కాదో కనుక్కుని తెలుసుకునేంత తీరిక అన్నిసార్లు ఉండదు. అందుకే సహాయం అందించడంలో తొందరపడితే అన్యాయంగా డబ్బు వృధా కావడం జరుగుతుంది.

సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ కు ఇది అనుభవమయ్యింది. ప్రసన్న సందేశ్ అనే వ్యక్తి తన తల్లి చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు లేవని ఆర్థిక సాయం కోరుతూ ట్వీట్ పెట్టాడు. ఆవిడ మృతదేహం ఫోటో కూడా ఉండటంతో జివి ప్రకాష్ గుడ్డిగా నమ్మేసి 20 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అసలు ట్విస్ట్ వేరే ఉంది.

సదరు ఫోటో ఎక్కడిదా అంటూ అభిమానులు ఆరా తీస్తే అది రెండేళ్ల క్రితం చనిపోయిన ఒక పెద్దావిడదని ఏఆర్ సెర్చ్ లో దొరికేసింది. దీంతో అకారణంగా జివి ప్రకాష్ సొమ్ము దుర్మార్గుడి చేతికి చేరిందని ఫ్యాన్స్ కలత చెందుతున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో నిజమైన బాధితులకు సాయం అందకుండా పోతుంది.

కరోనా సమయంలో సోనూ సూద్ ఇలాగే వేలాది మందికి సహాయం చేశారు. వాళ్ళలో ఒరిజినల్ డూప్లికేట్ రెండు రకాలూ ఉన్నారు. ఇప్పుడిది క్రమంగా ఒక వైరస్ లా మారిపోవడంతో ఎవరు పడితే వాళ్ళు స్టార్లను దర్శకులను జాలి కథలు చెప్పి మోసం చేయడం పరిపాటి అయ్యింది.

ఇకపై ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరవై వేలు జివి ప్రకాష్ కుమార్ కు పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ అదే సొమ్ము కొందరి జీవితాలను నిలబెట్టొచ్చు. ఒకరి చదువుకు సాయపడవచ్చు. కానీ మోసగాడి అకౌంట్ లో పడ్డం వల్ల ఎంత దుర్వినియోగం అవుతోందో చెప్పనక్కర్లేదు.

ఇదంతా చూసి రేపు ఎవరైనా సెలబ్రిటీ నిజంగా హెల్ప్ చేయాలనుకున్నా ముందుకు రాకపోవచ్చు. దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చట్టాలు, చర్యలు లేవు. స్టార్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉంటూ చెక్ చేసుకుని మరీ సహాయం చేయడం అవసరం.

This post was last modified on December 25, 2025 10:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: GV Prakash

Recent Posts

గ్రౌండ్ లెవెల్ పై రేవంత్ రెడ్డి దృష్టి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు సంవ‌త్స‌రాల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తున్న రేవంత్…

1 hour ago

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…

2 hours ago

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…

2 hours ago

ప్రమోషన్లలో మోసపోతున్న యంగ్ హీరో

తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…

3 hours ago

`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?

ఫోన్ ట్యాపింగ్ కేసులో  రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా.. సిట్…

4 hours ago

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

4 hours ago