సందీప్ స్పిరిట్ లుక్ కూడా మెయింటైన్ చేస్తాడా?

సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. అతను ఇప్పటిదాకా కేవలం మూడు సినిమాలే తీశాడు. అందులో తొలి రెండు సినిమాల కథ ఒకటే (ఒకటి రీమేక్). అంటే అతడి అనుభవం రెండు సినిమాలే. కానీ ఇంత తక్కువ జర్నీలోనే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు సందీప్. అందుకు సందీప్ తీసిన సినిమాలే కాక.. చాలా ప్రత్యేకమైన అతడి వ్యక్తిత్వం, మాట తీరు కూడా ఒక కారణం. సందీప్ ఇంటర్వ్యూలు తన సినిమాల్లాగే సూపర్ హిట్ అవుతుంటాయి. 

తన సినిమాల్లో హీరోల్లాగే సందీప్ వ్యక్తిగతంగా చాలా వెరైటీగా కనిపిస్తుంటాడు. అసలు సందీప్ సినిమాల్లో హీరోలు తన లాంటి వాళ్లే అనే అభిప్రాయం కలుగుతుంటుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ ప్రమోషన్ల టైంలో రియల్ కబీర్ సింగ్ సందీపే అని ఆ చిత్ర కథానాయకుడు షాహిద్ కపూర్ పేర్కొనడం గమనార్హం. ఇంకో విశేషం ఏంటంటే.. తాను ఏ సినిమా తీస్తుంటే ఆ మూవీ హీరో అవతారంలోకి మారడం సందీప్‌కు అలవాటు. 

అర్జున్ రెడ్డి తీసేపట్టుడు విజయ్ దేవరకొండ ఎలాంటి లుక్ లో కనిపించాడో సందీప్ కూడా అదే లుక్ లో ఉన్నాడు. ‘యానిమల్’ తీస్తున్నపుడు అందులో హీరో రణబీర్ కపూర్ లాగే జులపాల జుట్టు, గడ్డం పెంచుకుని కనిపించాడు సందీప్. ఆ సినిమా రిలీజయ్యాక గుండు కొట్టుకుని అందరికీ షాకిచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేస్తున్నాడు సందీప్. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఈసారికూడా ప్రభాస్ లుక్ ఎలాగైతే డిజైన్ చేశాడో, అదే లుక్ ను తను కూడా మెయింటైన్ చేస్తాడేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

‘స్పిరిట్’ కోసం ప్రభాస్ ఆల్రెడీ లుక్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సన్నబడ్డాడు. గడ్డం తీసేశాడు. ఐతే ఫైనల్ లుక్ ఏంటన్నది ఇంకా రివీల్ కాలేదు. ఈ సినిమా లుక్‌ను దాచిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కానీ సందీప్ ఏమైనా కొత్త లుక్ లో దర్శనమిస్తే అదే లుక్ లో ప్రభాస్ కూడా కనపడతాడన్న చర్చ ఫ్యాన్స్ లో మొదలయ్యింది.