మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో కొంచెం పేరున్న బేనరే. కాకపోతే సొంతంగా ఆ సంస్థ సినిమాలు తీయదు. ఇంకేదైనా పేరున్న బేనర్ చూసుకుని దాని భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తుంటుంది. గగనం, ఘాజి, క్షణం సహా మంచి విషయం ఉన్న సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ సంస్థలో తెరకెక్కాయి. ఐతే ఇప్పటిదాకా లో బడ్జెట్ సినిమాలే తీస్తూ వచ్చిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తొలిసారిగా ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టింది. అదే.. ఆచార్య.
రామ్ చరణ్ ఆధ్వర్యంలోని కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలిసి మెగాస్టార్-కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి. ఓవైపు అంత పెద్ద సినిమా తీస్తూ.. ఇంకోవైపు ఓ చిన్న సినిమాను ఈ సంస్థ మొదలుపెట్టింది. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాలో హీరో శ్రీ విష్ణు.
కొంత కాలం కిందట ఆహాలో నేరుగా విడుదలైన జోహార్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ మర్ని ఈ సినిమాను రూపొందించనున్నాడు. గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజిల్ సినిమా ఫేమ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథానాయిక అమృత నాయర్ కథానాయికగా నటించనుంది.
శ్రీవిష్ణు గత ఏడాది బ్రోచేవారెవరురా సినిమాతోనే కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత రాజ రాజ చోర అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యే రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో గాలి సంపత్ అనే సినిమాను మొదలుపెట్టాడు. అది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అది పూర్తయ్యేలోపే తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో సినిమాను లైన్లో పెట్టాడు.
This post was last modified on December 10, 2020 10:15 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…