ఇటీవలే విడుదలైన అవతార్ ఫైర్ అండ్ యాష్ మీద ఇండియాలో కూడా ఏ స్థాయిలో అంచనాలున్నాయో ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. డిసెంబర్ 19 రిలీజైన ఈ విజువల్ వండర్ కు మన దగ్గర మిశ్రమ స్పందన దక్కింది. టెక్నికల్ గా ఎంత గొప్పగా ఉన్నా దర్శకుడు జేమ్స్ క్యామరూన్ నిరాశ పరిచారని, మరీ నెమ్మదించిన కథనంతో పాత కథనే చూపించారనే కామెంట్స్ ఎక్కువ వినిపించాయి.
అందులోనూ మూడుంపావు గంటల నిడివిని ఆడియన్స్ భరించలేకపోతున్నారు. వీరాభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు కానీ న్యూట్రల్ ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో వీకెండ్ తర్వాత డ్రాప్ అయ్యింది.
ట్రేడ్ టాక్ ప్రకారం అవతార్ ఫైర్ అండ్ యష్ ఇండియాలో వసూలు చేసిన మొత్తం సుమారు 85 కోట్ల దాకా ఉందట. పెట్టుకున్న టార్గెట్ 450 కోట్ల పైమాటే. ఇప్పుడీ ఫిగర్ చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే దురంధర్ దూకుడు ఇంకా కొనసాగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో కొత్త రిలీజులు చాలా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అవతార్ 3 ఏదో అద్భుతం చేయడం అనుమానమే. వీక్ డేస్ ఆక్యుపెన్సీలు ఇరవై శాతం లోపే నమోదు కావడం బయ్యర్ వర్గాలను ఆందోళన పరుస్తోంది. మొన్న ఆదివారం బాగానే హౌస్ ఫుల్స్ పడ్డాయి కానీ ఒక్కసారిగా సోమవారం నుంచి డ్రాప్ తీవ్రంగా ఉండటం డేంజర్ బెల్ లాంటిది.
ఎలా చూసుకున్నా అవతార్ ఫైర్ అండ్ యాష్ మన దేశం వరకు డిజాస్టర్ అయ్యేలా ఉంది. ఇది సక్సెస్ కాకపోతే ఇకపై ఫ్రాంచైజ్ ఆపేస్తానని చెప్పిన దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఆ మాట మీద ఉంటారా లేదా అనేది వేచి చూడాలి. ఫలితం ముందే ఊహించారు కాబోలు వేరే కథలు రాసుకునే పనిలో పడ్డారట.
ఒకవేళ అవతార్ 4 తో ప్రొసీడ్ అయితే మాత్రం మునుపటి భాగాలంత హైప్ అయితే ఖచ్చితంగా రాదు. అవతార్, అవతార్ 2 వే అఫ్ వాటర్ కన్నా బాగా వెనుకబడిపోయిన అవతార్ 3 ఈ స్థాయిలో ఫ్లాప్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. సిచువేషన్ చూస్తుంటే నూటా యాభై కోట్లు కూడా అనుమానంగానే ఉంది.
This post was last modified on December 24, 2025 9:04 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…