శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో నిర్మించిన పరాశక్తి జనవరి 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు 14 అనుకున్నారు కానీ జన నాయకుడు ప్రొడ్యూసర్లు థియేటర్లను లాక్ చేసే విధానంలో అనుసరిస్తున్న పద్ధతి వల్ల తాము నష్టపోతున్నామని గుర్తించి పరాశక్తి నిర్మాతలు ముందుకు వచ్చారనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా ఉంది.
కేవలం ఒక్క రోజు గ్యాప్ కాబట్టి స్క్రీన్లను సమానంగా పంచే పద్దతి మీద ఒప్పందాలు జరుగుతున్నాయట. విజయ్ కు అయిదు రోజుల పాటు తిరుగు ఉండదని భావించిన అభిమానులకు పరాశక్తి ఇచ్చిన షాక్ కొంచెం గట్టిగానే తగిలేలా ఉంది.
ఇదిలా ఉండగా పరాశక్తి తెలుగు డబ్బింగ్ రిలీజ్ సమాంతరంగా ఉండకపోవచ్చని లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడున్న కాంపిటీషన్ లో అన్నేసి సినిమాల మధ్య దీన్ని తీసుకొస్తే షోలు చాలాక, జనాలకు రీచ్ కాక దెబ్బ తినొచ్చని భావించి ఒకటి రెండు వారాలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.
గతంలోనూ శివ కార్తికేయన్ కు ఇలాగే జరిగింది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ, సైంధవ్ ఉన్న కారణంగా అయలన్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయలేకపోయారు. తర్వాత రకరకాల కారణాల వల్ల థియేటర్ మోక్షం దక్కలేదు. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ లోనే సదరు అయలన్ దర్శనమిచ్చింది.
సో పరాశక్తి కనక తెలుగు రిలీజ్ డేట్ ఆలస్యం చేస్తే ఇలాంటి రిస్క్ లేకపోలేదు. అమరన్ నుంచి శివ కార్తికేయన్ కు మన దగ్గరా ఇమేజ్ వచ్చింది. మదరాసి డిజాస్టర్ అయినా సరే ఓపెనింగ్స్ డీసెంట్ గా వచ్చాయి. అందుకే పరాశక్తి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేయాలని అనుకున్నాడు.
కాకపోతే ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పరాశక్తి మనోళ్లకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం. జివి ప్రకాష్ సంగీతం, హీరోయిన్ శ్రీలీల పాత్ర, రవి మోహన్ విలనిజం, అధర్వ మురళి క్యారెక్టర్ లాంటి ఆకర్షణలు ఇందులో చాలానే ఉన్నాయి.
This post was last modified on December 24, 2025 9:01 am
నారి నారి నడుమ మురారి సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న శర్వానంద్ మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ తనకు…
సంక్రాంతి బరిలో నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డ్ కలెక్షన్లు మేకర్స్ కి మంచి బూస్ట్…
టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల…
టాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించిన చర్చే కనిపిస్తోంది. ఇకపై రాష్ట్రంలో టికెట్ ధరలు…
పొంగల్ పండగ సందర్భంగా సెన్సార్ వివాదాలను ఎదురుకుని తమిళంలో విడుదలైన పరాశక్తి ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పేరుకు వంద…
స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది.…