Movie News

ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేయ‌మ‌ని నిధిని అడిగితే..

గ‌త బుధ‌వారం ‘రాజాసాబ్’ రెండో పాట లాంచ్ కోసం హైదరాబాద్ కూకటపల్లిలోని ‘లులు మాల్’లో చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లోపంతో ఎంత అస్తవ్యస్తంగా తయారైందో తెలిసిందే. పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడ‌గా.. వారి మ‌ధ్య నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్‌ను బయటికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బంది తలెత్తింది. జనం మధ్య నలిగిపోయిన నిధి… ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంది.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో కూక‌ట్ ప‌ల్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిర్వాహకులతోపాటు మాల్ యాజమాన్యం పైనా కేసులు పెట్టారు. ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేద‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ కేసు విష‌య‌మై పోలీసులు.. నిధిని సంప్ర‌దించారు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారి మీద కేసులు పెట్టాల‌ని పోలీసులు కోర‌గా.. నిధి నిరాక‌రించింద‌ట‌.

త‌న‌తో ప‌లువురు అభిమానులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ప్ప‌టికీ.. వారి మీద ఫిర్యాదు చేయడానికి నిరాకరించింద‌ట నిధి. పోలీసులు గ‌ట్టిగా అడిగినా.. తాను ఎవరి మీద ఫిర్యాదు చేయదలచుకోలేదని నిధి తేల్చి చెప్పేసింద‌ట‌. ఇలాంటి వ్య‌వ‌హారాల‌పై ఫిలిం సెల‌బ్రెటీలు స్పందించాల‌ని.. వారు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తేనే అభిమానుల పేరుతో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించే ఆక‌తాయిల‌కు బుద్ధి చెప్ప‌గ‌ల‌మ‌ని పోలీసులు అంటున్నారు.

కానీ లోపం ప్ర‌ధానంగా నిర్వాహ‌కుల‌దే అన్న ఉద్దేశం కావ‌చ్చు.. లేక ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల మీద ఏం ఫిర్యాదు చేస్తామ‌ని నిధి అనుకుందో కానీ.. పోలీసుల విజ్ఞ‌ప్తిని నిరాక‌రించింది. రాజాసాబ్ ఈవెంట్ సంద‌ర్భంగా నిధి అంత అసౌక‌ర్యానికి గురైన‌ప్ప‌టికీ.. నిర్వాహ‌కుల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం కానీ, అభిమానుల మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం కానీ చేయ‌లేదు. ఆ గంద‌ర‌గోళం త‌ర్వాత కూడా ఆమె రాజాసాబ్ పాటపై సోష‌ల్ మీడియా పోస్టు పెట్టింది. ఇప్పుడు ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం చూసి నిధి బంగారం అంటూ ఆమెను నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.

This post was last modified on December 23, 2025 9:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago