ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది కీలక దశకు చేరుకుంది. పలు పబ్లిక్ ప్లేసుల్లో చేయడంతో వీడియో లీకులు బయటికి వస్తున్నాయి. ఎర్రకోట దగ్గర రామ్ చరణ్ నడుస్తున్న ఫోటోలు టీమ్ వదిలినట్టు అనిపించినా తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మెట్లను ఎక్కి దిగుతున్న సీన్ ఎవరో దూరం నుంచి షూట్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నిజానికి బహిరంగ ప్రదేశాల్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. గతంలో వారణాసి సైతం ఈ సమస్యను ఎదురుకుంది. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా కన్ఫర్మ్ కాక ముందే మహేష్ బాబుతో ఆయన నటించిన సన్నివేశం హల్చల్ చేసింది.
అయితే పెద్ది ఈ లీకులను పెద్దగా పట్టించుకునేలా కనిపించడం లేదు. ఎందుకంటే వీటి వల్ల కథకు కీలకమైన క్లూస్ ఏవీ బయటికి రాలేదు. సో దర్శకుడు బుచ్చిబాబు అందుకే నిశ్చింతగా ఉండొచ్చు. ఇది పెద్దికి సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్. క్లైమాక్స్ ఘట్టాన్ని ఇక్కడే తీయబోతున్నారు.
ఇప్పటికే దీని గురించి ఇన్స్ సైడ్ ఇన్ఫో రెంగస్థలంకి పదిరెట్లు అనిపించేలా ఉంటుందని చెప్పడం అభిమానులను తెగ ఊరిస్తోంది. అదే నిజమైతే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఏపీలోని చిన్న పల్లెటూరు నుంచి ఒక మోటు కుర్రాడు ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఎవరూ ఊహించని పాయింట్ తో ఉంటుందని వినికిడి.
మార్చి 27 పెద్ది రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్లానింగ్ పరుగులు పెట్టిస్తున్నాడు. ప్యారడైజ్ సైతం వెనక్కు తగ్గేదేలే అంటూ సంకేతాలు ఇస్తుండగా, ఒకరు డ్రాప్ అయ్యే సూచనలు లేకపోలేదు. అది ఎవరనేది ఇప్పట్లో తేలేదు.
చికిరి చికిరి చార్ట్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండో ఆడియో సింగల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర కానుకగా ఇవ్వాలని బుచ్చిబాబు చూస్తున్నారు కానీ సంక్రాంతి సినిమాల హడావిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on December 23, 2025 5:29 pm
స్టేజ్ మీద మాట తూలడం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య సినీ ప్రముఖులలో పలువురి విషయంలో ఇదే…
ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచడం కోసం వేరే భాషల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం ఎప్పట్నుంచో ఉన్నదే. గత కొన్నేళ్లలో…
క్రిస్మస్ పండక్కు వస్తున్న సినిమాల్లో దండోరా అనే చిన్న మూవీ బాగానే సౌండ్ చేస్తోంది. ప్రమోషన్లతో ఆడియన్స్ దృష్టిలో పడ్డ…
సరైన హిట్టు లేక అల్లాడిపోతున్న రణ్వీర్ సింగ్ కు దురంధర్ ఇచ్చిన కిక్కు అంతా ఇంతా కాదు. తనతో పాటు…
అఖండ తాండవం 2 ఫలితం తేలినట్టే ఉంది కానీ ఇంకోవైపు తేలనట్టు కూడా అనిపిస్తోంది. కారణం బుకింగ్స్. రెండో వీక్…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.…