సరైన హిట్టు లేక అల్లాడిపోతున్న రణ్వీర్ సింగ్ కు దురంధర్ ఇచ్చిన కిక్కు అంతా ఇంతా కాదు. తనతో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆదిత్య ధార్ లకు సమానంగా పేరు వచ్చినప్పటికీ హీరోగా తన ఖాతాలోనే ఇది జమవుతుంది కాబట్టి ధీమాగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా దురంధర్ 2 మీద వెయ్యి కోట్ల కనీస బిజినెస్ ని నిర్మాతలు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే బయ్యర్ ఆఫర్లు చాలా క్రేజీగా ఉన్నాయట. మార్చి 19 అయితే ఒక రేటు, ఒకవేళ లేట్ అయితే అంతకన్నా ఎక్కువ రేట్ ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. ఇంకో రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే దురంధర్ దెబ్బ నేరుగా డాన్ 3 మీద పడిందని ముంబై టాక్. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న ఈ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ లో రణ్వీర్ హీరోగా నటిస్తాడని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగటివ్ ఎక్కువ వినిపించాయి.
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ స్వాగ్ ని మ్యాచ్ చేసే స్థాయికి ఇంకా రణ్వీర్ ఎదగలేదని నెటిజెన్లు ఓపెన్ గానే అన్నారు. దానికి తోడు బడ్జెట్ పరంగా వేసుకున్న లెక్కలు దురంధర్ ముందువి కావడంతో నిర్మాత కాస్త ముందు వెనుక ఆడారు. కానీ ఇప్పుడు తీరా ఓకే అనుకున్న సమయానికి రణ్వీర్ సింగే ప్రాజెక్టు నుంచి వచ్చేసినట్టు సమాచారం.
ఎందుకంటే ఆల్రెడీ జనాలు చూసేసి అరిగిపోయిన డాన్ లాంటి కథల కన్నా దురంధర్ తరహాలో ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో డాన్ 3కి నో చెప్పినట్టు తెలిసింది. అపరిచితుడు రీమేక్ సైతం ఏడాది క్రితం వద్దనుకోవడానికి కారణం ఇదే.
తాజాగా ప్రళయ్ అనే జాంబీ మూవీకి ఓకే చెప్పినట్టు రిపోర్ట్. జై మెహతా దర్శకత్వంలో రూపొందబోయే ప్రళయ్ షూటింగ్ అనుకున్న దానికన్నా ముందే మొదలుపెడదామని రణ్వీర్ సింగ్ కబురు పెట్టాడట. ఇది కూడా చాలా హై బడ్జెట్ మూవీ. హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉంటాయి. గతంలో వచ్చిన జాంబీ సినిమాల పోలిక లేకుండా కొత్త ట్రీట్ మెంట్ తో రాసుకున్నట్టు తెలిసింది.
This post was last modified on December 23, 2025 5:09 pm
ఔను! మీరు చదివింది నిజమే. వంటింటి నిత్యావసరమైన వాటిలో కీలకమైంది.. అదేసమయంలో ఎడం చేత్తో తీసి పారేసేది.. కరివేపాకు. ఒకప్పుడు..…
గత బుధవారం ‘రాజాసాబ్’ రెండో పాట లాంచ్ కోసం హైదరాబాద్ కూకటపల్లిలోని ‘లులు మాల్’లో చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లోపంతో…
స్టేజ్ మీద మాట తూలడం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య సినీ ప్రముఖులలో పలువురి విషయంలో ఇదే…
ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది కీలక దశకు చేరుకుంది. పలు పబ్లిక్ ప్లేసుల్లో చేయడంతో వీడియో లీకులు బయటికి వస్తున్నాయి.…
ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచడం కోసం వేరే భాషల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం ఎప్పట్నుంచో ఉన్నదే. గత కొన్నేళ్లలో…
క్రిస్మస్ పండక్కు వస్తున్న సినిమాల్లో దండోరా అనే చిన్న మూవీ బాగానే సౌండ్ చేస్తోంది. ప్రమోషన్లతో ఆడియన్స్ దృష్టిలో పడ్డ…