Movie News

రియాక్షన్లు గమనించావా జనార్దనా

నిన్న విడుదలైన రౌడీ జనార్ధన టీజర్ మీద రకరకాల స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు విజయ్ దేవరకొండ మాస్ కటవుట్ మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుండగా మరికొందరు నాని ప్యారడైజ్ ని స్ఫూర్తిగా తీసుకోవడం పట్ల దర్శకుడు రవికిరణ్ కోలాని పాయింట్ అవుట్ చేస్తున్నారు.

కేవలం కల్ట్, బోల్డ్ అనిపించుకునేందుకు ల…కొడక అనే పదాన్ని జనరలైజ్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. రంగస్థలంలో కూడా ఇలాంటి వాడుక జరిగింది కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనడానికి, ఏకంగా హీరోతోనే ఆ పదం పలికించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆ తేడా ఏంటో గుర్తించాలి.

ఇక రౌడీ జనార్ధన షూటింగ్ చాలా జరగాల్సి ఉంది కాబట్టి తీసిన ఫుటేజ్ నుంచే ముఖ్యమైన ఎపిసోడ్ లోని సన్నివేశాన్ని ఇలా టీజర్ కోసం వాడుకున్నారు. సో ఇప్పటికిప్పుడు కంటెంట్ మీద ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది.

కాకపోతే కెజిఎఫ్ తరహా డార్క్ వరల్డ్ ని ఆల్రెడీ కింగ్డమ్ లో వాడేసిన విజయ్ దేవరకొండ ఈసారి శ్రీలంక వదిలేసి పాత గోదావరి జిల్లకు వెళ్ళిపోయి కత్తి పట్టి రక్తపాతం చేయబోతున్నాడు. మీసకట్టు, సిక్స్ ప్యాక్ బాడీ అన్నీ మాస్ టచ్ తో ఉన్నాయి. ఇంటికొకడు రౌడీ ఉంటే నా ఇంటి పేరే రౌడీ అంటూ చెప్పించిన డైలాగు అభిమానులకు వేగంగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

సినిమా విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉంది కనక టెన్షన్ అక్కర్లేదు. రౌడీ జనార్ధనలో హీరోయిన్  గా నటిస్తున్న కీర్తి సురేష్ కు కూడా పెర్ఫార్మన్స్ పరంగా చాలా స్కోప్ ఉంటుందట. బడ్జెట్ పరంగా పెద్ద రిస్క్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు అవుట్ ఫుట్ మీద చాలా ధీమాగా ఉన్నారు.

లేకపోతే సంవత్సరం ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టడం చిన్న విషయం కాదు. తమ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ కావడంతో ఈసారి ఖచ్చితంగా హిట్టు కొట్టాలనే లక్ష్యంతో రౌడీ జనార్ధనను లాక్ చేశారు. రవికిరణ్ కోలా తాను అనుకున్నది సాధిస్తే టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. దేవరకొండకు సక్సెస్ ఇచ్చిన క్రెడిట్ కూడా దక్కుతుంది.

This post was last modified on December 23, 2025 10:40 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరాశక్తి దర్శనం మనకు ఉండదా

శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో నిర్మించిన పరాశక్తి జనవరి 10 విడుదల…

9 minutes ago

అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా 'లాటరీ…

39 minutes ago

నింగిలోకి ‘బాహుబలి’… అంతరిక్షం నుంచే ఇంటర్నెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మన 'బాహుబలి' రాకెట్ LVM3-M6 శ్రీహరికోట…

59 minutes ago

లిటిల్ హార్ట్స్… ఇప్పుడు వాళ్ళకి కూడా ఎక్కేసింది

లిటిల్ హార్ట్స్... ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమాల్లో దీన్ని మించిన సెన్సేష‌న్ లేదు. కేవ‌లం రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్లో…

2 hours ago

తెలుగు డబ్బింగ్ చేయకపోవడమే మంచిది

పుష్ప 2, యానిమల్ ని టార్గెట్ చేస్తూ వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్…

2 hours ago

అంతుచిక్కని ప్రశాంత్ వర్మ ప్లానింగ్

హనుమాన్ వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఇప్పటిదాకా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఊసే లేదు. రిషబ్ శెట్టితో జై హనుమాన్…

3 hours ago