బిగ్ బాస్ షో ద్వారా.. ఆ తర్వాత కోర్టు మూవీలో విలన్ పాత్ర ద్వారా మళ్ళీ మంచి పాపులారిటీ సంపాదించి బిజీ నటుడిగా మారాడు సీనియర్ నటుడు శివాజీ. ఆయన కీలక పాత్ర పోషించిన దండోరా సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. సోమవారం రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
అమ్మాయిలు.. హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్లామర్ పేరుతో హద్దులు దాటొద్దని సూచిస్తూ.. “మీ అందం చీరలోనో.. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనో ఉంటాది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఉండదమ్మా” అని ఆయన కామెంట్ చేశారు.
ముందుగా ఈ ఈవెంట్ కు చీర కట్టుకుని వచ్చిన యాంకర్ ప్రశాంతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆమెకు కితాబిచ్చారు శివాజీ.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఇంకో విషయం చెబుతున్నా.. అమ్మాయిలు, ముఖ్యంగా హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా. ఏమనుకోవద్దు. హీరోయిన్లు అందరూ. మీరు అనుకున్నా మనకు పోయేదేమీ లేదు. లాగిపీకుతాం మనం. అది వేరే విషయం. కానీ.. మీ అందం చీరలోనో.. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనో ఉంటాది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఉండదమ్మా.
అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసి నవ్వుతూ అంటారే కానీ.. దరిద్రం ***..ఇలాంటి బట్టలేసుకున్నావు ఎందుకు.. కొంచెం మంచి బట్టలేసుకోవచ్చుగా బావుంటావు అని అనాలనిపిస్తుంది లోపల. అనలేం. అంటే మళ్లీ స్త్రీ స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుద్ది. ఈ ప్రకృతి అంత అద్భుతంగా ఉంటది.
అలాగే స్త్రీ.. మా అమ్మ ఎప్పటికీ గుండెల్లో కనబడతా ఉంటది ఒక సావిత్రమ్మ, ఒక సౌందర్య. ఇంకా ఈ జనరేషన్లో కూడా ఎంతో మంది ఉన్నారు. రష్మిక లాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్లు కాబట్టి పేర్లు చెప్పగలుగుతున్నాం. గ్లామర్ ఉండాలి. కానీ అది ఒక దశ వరకే. నేను ఎవరిని ఇలా మాట్లాడడానికి అని రేప్పొద్దున పెద్దవాళ్లు బయల్దేరతారు. ప్రపంచ వేదికల మీద కూడా చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి” అని పేర్కొన్నారు.
This post was last modified on December 22, 2025 11:46 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…