ఈ నెల మొదటి వారంలో ‘దురంధర్’ సినిమా రిలీజవుతుంటే.. దాని చుట్టూ చాలా వరకు నెగెటివిటీనే కనిపించింది. ఫ్లాపుల్లో ఉన్న రణ్వీర్ సింగ్‌ను చూడ్డానికి జనం వస్తారా.. ఏ ధైర్యంతో దీనిపై 350 కోట్ల బడ్జెట్ పెట్టారు.. మూడున్నర గంటలకు పైగా నిడివి అంటే తట్టుకోగలరా.. అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా ఉన్నాయే అంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది.
సినిమాకు మోడరేట్ రివ్యూలు వచ్చినా సరే.. బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం అద్భుతాలు చేస్తూ సాగిపోయింది. కొత్త సినిమాలకు రోజులు గడిచేకొద్దీ వసూళ్లు నెమ్మదించడం సహజం. కానీ ఈ చిత్రానికి అంతకంతకూ వసూళ్లు పెరుగుతూ పోయాయి. మూడో వారంలో కూడా జోరు తగ్గించలేదు దురంధర్. ‘అవతార్-3’ లాంటి క్రేజీ మూవీ వచ్చినా దాన్ని కూడా డామినేట్ చేసింది. తాజాగా ఈ మూవీ హిందీలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘ఛావా’ పేరిట ఉన్న రూ.800 కోట్ల మైలురాయిని ‘దురంధర్’ దాటేసింది.
ఇక ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ‘దురంధర్’ నిలవడం కూడా లాంఛనమే. ‘కాంతార: చాప్టర్-1’ రూ.850 కోట్ల వసూళ్లతో రికార్డు నెలకొల్పింది. ‘దురంధర్’ మూడో వీకెండ్లోనూ రూ.95 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. హిందీలో ఈ వారం ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ సినిమా రాబోతోంది. దానికి కొంచెం క్రేజ్ ఉన్నా సరే.. ‘దురంధర్’ను డామినేట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
క్రిస్మస్ వీకెండ్లోనూ కూడా రణ్వీర్ సినిమానే లీడ్ తీసుకునేలా ఉంది. వీకెండ్ వచ్చేలోపే ‘కాంతార’ రికార్డును బద్దలు కొట్టి రూ.1000 కోట్ల మైలురాయిని కూడా టార్గెట్ చేసేలా ఉంది ‘దురంధర్’. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొస్తే.. ఈ ఏడాది వెయ్యి కోట్ల సినిమా లేని లోటును ఇది తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుల్ రన్లో రూ.వెయ్యి కోట్లు సాధ్యమే కానీ.. ఈ ఏడాదే ఆ రికార్డును అందుకుంటుందా లేదా అన్నదే సస్పెన్సు.
This post was last modified on December 22, 2025 9:19 pm
వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు,…
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి రౌడీ జనార్ధనగా రాబోతున్నాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జనాలు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.…
16 ఏళ్ల కిందట వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ కథకు, ఆ విజువల్స్‌కు,…
శర్వానంద్ చాలా గ్యాప్ తర్వాత ఫుల్ ఫన్ రోల్ తో వస్తున్నాడు. జనవరి 14 సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న…