16 ఏళ్ల కిందట వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ కథకు, ఆ విజువల్స్‌కు, ఆ ఎఫెక్ట్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్ల రికార్డును అందించారు. ఆ చిత్రం సాధించిన అసాధారణ విజయం చూసి దర్శక నిర్మాత ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రారంభించాడు.
తొలి సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూడేళ్ల కిందట రిలీజైంది. కానీ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. ప్రి రిలీజ్ బజ్ వల్ల వసూళ్లయితే భారీగా వచ్చాయి. ఐతే నాలుగు రోజుల కిందట రిలీజైన కొత్త సీక్వెల్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మాత్రం ఇటు పాజిటివ్ రివ్యూలూ తెచ్చుకోలేకపోయింది, అటు ఆశించిన కలెక్షన్లూ సాధించలేకపోతోంది. ‘అవతార్-2’ ఇండియాలో ఓపెనింగ్ వీకెండ్లో సాధించిన వసూళ్లలో సగం కూడా రాబట్టలేకపోయింది ‘అవతార్-3’.
‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’కు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే.. తొలి వీకెండ్లో రూ.137 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది. కానీ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇండియా వీకెండ్ వసూళ్లు రూ.60 కోట్లకు పరిమితం అయ్యాయి. కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న ‘దురంధర్’ ముందు ‘అవతార్-3’ నిలవలేకపోయింది. కొత్త సినిమా అయిన ‘అవతార్-3’ను పాత చిత్రమైన ‘దురంధర్’ మూడు రోజుల్లో పూర్తిగా డామినేట్ చేసింది. ఆ చిత్రానికి మూడో వీకెండ్లో రూ.95 కోట్ల దాకా వసూళ్లు రావడం విశేషం.
‘అవతార్-3’ అంచనాలను అందుకోలేకపోవడం ‘అఖండ-2’కు కూడా బాగానే కలిసొచ్చింది. రెండో వీకెండ్లో ఆ చిత్రం మంచి వసూళ్లే రాబట్టింది. కేవలం విజువల్స్ కోసం మంచి స్క్రీన్లలో ఈ సినిమా చూడాలి తప్ప.. అంతకుమించి ఇందులో విశేషమేమీ లేదనే అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్లడంతో ‘అవతార్-3’ని ఆడియన్స్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on December 22, 2025 3:41 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…