ఈ ఏడాది చివరి బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధమైంది. క్రిస్మస్ వీకెండ్లో ఎప్పుడూ చెప్పుకోదగ్గ సినిమాలే రిలీజవుతుంటాయి. పోటీ కూడా గట్టిగానే ఉంటుంది. ఈసారి పెద్ద సినిమాలు లేవు కానీ.. పోటీ మాత్రం గట్టిగానే ఉంది. అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతుండడం విశేషం. వాటిలో చాలా వరకు కంటెంట్ రిచ్ సినిమాలే ఉండడం గమనార్హం. పెద్ద బడ్జెట్లు పెట్టకపోయినా.. స్టార్లు లేకపోయినా.. కంటెంట్‌నే నమ్ముకుని వస్తున్నాయి ఈ వారం సినిమాలు.
క్రిస్మస్ వీకెండ్లో ఎక్కువ అంచనాలున్న సినిమా.. ‘ఛాంపియన్’ అనే చెప్పాలి. నిర్మలా కాన్వెంట్, పెళ్ళిసంద-డి చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక.. చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రమిది. ‘పెళ్ళిసంద-డి సినిమా ఓ మోస్తరుగా ఆడగా.. రోషన్ లుక్స్, యాక్టింగ్ విషయంలో ప్రశంసలు లభించాయి. తర్వాత అవకాశాలు వరుసకట్టినా ఆచితూచి వ్యవహరించిన రోషన్.. స్వప్న సినిమా బేనర్లో ‘ఛాంపియన్’ లాంటి విభిన్నమైన సినిమా చేశాడు.
షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం ఉన్న ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిజాంల కాలం నాటి కథతో ప్రామిసింగ్ మూవీ చేసినట్లున్నాడు ప్రదీప్. దీని టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. రోషన్ స్థాయికి మించిన బడ్జెట్ పెట్టి టీం చాలా కష్టపడి సినిమా తీసింది.
ఇక క్రిస్మస్ బరిలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. శంబాల. ఓటీటీ హీరోగా ముద్ర పడిపోయిన ఆది సాయికుమార్ చాన్నాళ్ల తర్వాత కంటెంట్ రిచ్ సినిమా చేసినట్లున్నాడు. ఈ సినిమా ప్రోమోలు భలేగా అనిపించాయి. ‘కార్తికేయ’ తరహాలో డివైన్ ఎలిమెంట్స్‌తో ముడిపడ్డ థ్రిల్లర్ సినిమాలా కనిపిస్తోందీ చిత్రం. ఇది తనకు కచ్చితంగా బ్రేక్ ఇస్తుందని ఆది ఆశిస్తున్నాడు. ఇక శివాజీ కీలక పాత్ర పోషించిన ‘దండోరా’ కులం చుట్టూ తిరిగే హార్డ్ హిట్టింగ్ డ్రామాలా కనిపిస్తోంది. దీని ప్రోమోలూ బాగున్నాయి. చివరగా రిలీజ్ చేసిన ట్రైలర్లో డైలాగులు భలేగా పేలాయి.
క్రిస్మస్‌కు రిలీజవుతున్న మరో ఇంట్రెస్టిగ్ మూవీ ‘ఈషా’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలను అందించిన బన్నీ వాసు, వంశీ నందిపాటి కలిసి రిలీజ్ చేస్తున్న హార్రర్ మూవీ ఇది. ఈ చిత్రంలో ఒళ్లు జలదరించే సన్నివేశాలు ఉంటాయని.. థియేటర్లకు వచ్చే వాళ్లు జాగ్రత్త అని అంటోంది టీం. ప్రోమోలు కూడా భయపెట్టేలాగే ఉన్నాయి.
మరోవైపు మోహన్ లాల్ అనువాద చిత్రం ‘వృషభ’ కూడా ఈ వీకెండ్లోనే రానుంది. లాలెట్టన్ సినిమా అంటే అందులో కంటెంట్ బలంగానే ఉంటుంది. ‘పతంగ్’ అనే మరో చిన్న సినిమా కూడా ఈ వారమే రిలీజవుతోంది. దాని ప్రోమోలు కూడా బాగున్నాయి. కిచ్చా సుదీప్ సినిమా ‘మార్క్’, బ్యాడ్ గర్ల్స్ అనే ఓ చిన్న సినిమా కూడా వస్తున్నాయి కానీ.. వాటి మీద పెద్దగా అంచనాలు లేవు.
This post was last modified on December 22, 2025 3:04 pm
ఏపీకి ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనున్న కీలక ప్రాజెక్టు పోలవరం. ఇది…
బిగ్ బాస్ షో ద్వారా.. ఆ తర్వాత కోర్టు మూవీలో విలన్ పాత్ర ద్వారా మళ్ళీ మంచి పాపులారిటీ సంపాదించి…
వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు,…
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి రౌడీ జనార్ధనగా రాబోతున్నాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జనాలు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.…