మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశ పడతాడు ప్రతి తెలుగు దర్శకుడు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అలాంటి ఆశతో ఉన్నవాడే. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్లతో పని చేసిన హరీష్.. పవన్‌తో రెండో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఎప్పటికైనా చిరుతో సినిమా చేయాలన్న కోరికతో ఉన్న హరీష్‌కు చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అని చెబుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీష్.. చిరుతో సినిమా చేసే అవకాశం గురించి మాట్లాడాడు. చిరుతో తన సినిమా తప్పక ఉంటుందని.. దాన్ని ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దాలన్నది తన కోరిక అని చెప్పాడు.
చిరు సినిమాల్లో తనకు రౌడీ అల్లుడు చాలా ఇష్టమని.. అదే తరహాలో వినోదాత్మకంగా సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి చెబుతూ.. ఒక అభిమానిలా మారి ఇంతకుముందు పవన్‌తో గబ్బర్ సింగ్ తీశానని.. ఈసారి చేయబోయే సినిమా కూడా నిజమైన పవన్ అభిమానిగానే చేయబోతున్నానని చెప్పాడు. ఎలాంటి జానర్, కథేంటి అన్నది చెప్పని హరీష్.. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందన్నాడు.
లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా అనుకున్నదానికంటే ఆలస్యమయ్యేలా ఉందని.. ఐతే మన చేతుల్లో లేని దాని గురించి ఏమీ చేయలేమని వ్యాఖ్యానించాడు హరీష్. ఏదేమైనా మంచి ఎంటర్టైనర్లు తీస్తాడని పేరున్న హరీష్.. చిరు, పవన్ ఇద్దరితోనూ సినిమాలు చేస్తానని చెప్పడం మెగా అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్తే.
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…