శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి అద్భుతమైన సినిమాలతో నిర్మాతగా ఒక సమయంలో తిరుగులేని పేరు సంపాదించిన ఎం.ఎస్.రాజు నుంచి ‘డర్టీ హరి’ పేరుతో ఓ సినిమా రాబోతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ సినిమా ప్రోమోలు చూశాక అందరూ ముక్కున వేలేసుకున్నారు. క్లీన్ ప్రొడ్యూసర్‌గా పేరున్న రాజు.. దర్శకుడిగా ఇలాంటి సినిమా తీయడమేంటి అని షాకయ్యారు. కానీ రాజు మాత్రం ఏమీ తగ్గలేదు. ఎరోటిక్ సీన్లతో కూడిన ప్రోమోలు వదులుతూనే వచ్చాడు.
తాజాగా రిలీజ్ చేసిన రెండో ట్రైలర్ మునుపటి ప్రోమోలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ అందులోనూ ‘మసాలా’ ఏమీ తక్కువగా లేదు. దీన్ని బట్టి ఈ సినిమాపై అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. సక్సెస్ కోసం రాజు బూతును నమ్ముకున్నాడని బలమైన అభిప్రాయంతో ఉన్నారు. కానీ అది తప్పని అంటున్నాడు రాజు.
ఈ నెల 18న ఫ్రైడే మూవీస్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదలవుతున్న ఈ సినిమా చూసి.. తర్వాత ఎవరైనా తనను ప్రశ్నలు వేయొచ్చని రాజు సవాల్ విసిరాడు. బూతు వేరు, శృంగారం వేరు అని.. రెంటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని.. ఓ అమ్మాయితో అబ్బాయి ఇన్వాల్వ్ అయినప్పుడు ఎంత దిగజారతాడనేది చెప్పడానికి ‘డర్టీ హరి’ టైటిల్ పెట్టానని.. అతను డర్టీ అనేది చెప్పకపోతే డ్రామా పండదని.. సినిమాలో మంచి హ్యూమన్ డ్రామా ఉందని.. ఈ సినిమా చూసేలా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడానికి తాను ఓ టెక్నిక్ వాడాను తప్ప ప్రేక్షకులు అనుకుంటున్నట్లుగా సినిమా ఉండదని రాజు చెప్పాడు.
‘‘క్లీన్ ప్రొడ్యూసర్ ఇమేజ్ ఉన్న నేను ఇటువంటి సినిమా చేయడమేంటి.. బోర్డర్ దాటడమేంటి అని కొందరు అనుకుంటున్నారు. శుక్రవారం సినిమా చూడండి. చూశాక కామెంట్ చేయండి. ఆదివారం సక్సెస్ మీట్ పెడతా. అప్పుడు ఎవరైనా ‘సార్… మీరు తప్పు చేశారు’ అని అడగొచ్చు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ఎంఎస్ రాజు సినిమా… బూతు సినిమా కాదు. కంప్లీట్ సినిమా చూసి ఎగ్జైట్ అయిన ‘బన్నీ’ వాసు గారికి, బ్లాంక్ చెక్ ఇచ్చిన హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారికి థ్యాంక్స్’’ అని రాజు అన్నారు.
This post was last modified on December 10, 2020 1:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…