వచ్చే ఏడాది మార్చి చివరి వారానికి టాలీవుడ్ నుంచి రెండు పేరున్న సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ తన పుట్టిన రోజే అయిన మార్చి 27కు షెడ్యూల్ అయింది. తర్వాత నాని చిత్రం ‘ది ప్యారడైజ్’ కూడా అదే వీకెండ్‌ను రిలీజ్ కోసం ఎంచుకుంది. మార్చి 26ను విడుదల తేదీగా ప్రకటించింది. వీటిలో చరణ్ సినిమా రేంజి వేరు. ముందుగా సెట్స్ మీదికి వెళ్లింది కూడా ఆ చిత్రమే.
దీంతో నాని సినిమా పోటీ నుంచి తప్పుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ నాని కూడా ఆ డేట్ విషయంలో పట్టుదలతోనే ఉన్నాడు. ‘ది ప్యారడైజ్’ మొదలవడానికి ముందే రిలీజ్ డేట్ క్లాష్ గురించి నాని స్పందించాడు. రిలీజ్ సమయానికి ఎవరు రేసులో ఉంటారో చూడాలని.. ఒకవేళ రెండు సినిమాలూ ఒకేసారి వచ్చినా ఇబ్బంది లేదని అన్నాడు నాని. ఐతే మధ్యలో ఈ రెండు చిత్రాలూ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ రెండు చిత్ర బృందాలూ ఆ ప్రచారాన్ని ఖండిచాయి.
కాగా ‘పెద్ది’ సినిమా మేకర్స్ ఏదైనా ప్రోమో రిలీజ్ చేసినా.. లేదా విడుదల తేదీ గురించి అప్‌డేట్ ఇచ్చినా.. వెంటనే ‘ది ప్యారడైజ్’ టీం కూడా వెంటనే ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుండడం విశేషం. కొన్ని రోజుల ముందు బుచ్చిబాబు ‘పెద్ది’ విడుదల తేదీ గురించి ఒక వేదికలో మాట్లాడాడు. అలాగే నిర్మాత ఒక నోట్ రిలీజ్ చేశాడు. వెంటనే ‘ప్యారడైజ్’ టీం దర్శకుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసి తమ సినిమా కూడా అదే తేదీకి రాబోతోందని కన్ఫమ్ చేసింది. తాజాగా రామ్ చరణ్ ‘ఛాంపియన్’ వేడుకలో మార్చి 27నే తమ సినిమా వస్తుందని చెప్పాడు. వెంటనే ‘ది ప్యారడైజ్’ టీం సినిమా నుంచి సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి విడుదల తేదీని కన్ఫమ్ చేసింది.
పనిగట్టుకుని సంపూ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చూస్తే ‘పెద్ది’ టీంను ‘ది ప్యారడైజ్’ బృందం గిచ్చుతున్నట్లే ఉంది. రేసులో తాము ఎంతమాత్రం వెనుకబడలేదని.. మార్చి చివరి వారం రిలీజ్ విషయంలో తాము తగ్గేదే లేదని ఎప్పటికప్పుడు నాని టీం చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఇంతకుముందు చిరు టైటిల్ ‘గ్యాంగ్ లీడర్’ను నాని వాడుకున్నపుడు అతడి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు చరణ్ సినిమాకు పోటీగా తన సినిమాను వదలడానికి ప్రయత్నిస్తున్నందుకు కొంచెం గుర్రుగా ఉన్నారు. కానీ చిరు చెయ్యబోయే ఓదెల సినిమాను నిర్మించేది కూడా నానినే కావడంతో చివరి నిమిషంలో ఎవరు తగ్గుతారో చూడాలి.
This post was last modified on December 20, 2025 7:06 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…