అవతార్.. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న చిత్రం. కంటెంట్‌తో మెప్పించడమే కాదు.. కలెక్షన్ల వర్షమూ కురిపించిందీ మూవీ. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయాన్ని చూసి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్.. ఏకంగా నాలుగు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు. అవతార్ తీయడానికి పదేళ్లు టైం తీసుకున్న కామెరూన్.. తొలి సీక్వెల్‌కు ఇంకా ఎక్కువగా 12 ఏళ్ల టైం పెట్టాడు.
కానీ ఇంత టైం తీసుకుని రూపొందించిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మొదటి పార్ట్ అంతటి అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్స్ అద్భుతం అంటూనే.. సినిమా బోర్ కొట్టించిందనే అభిప్రాయాన్ని కొంతమంది ప్రేక్షకులు వ్యక్తం చేశారు. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల వసూళ్లయితే బాగానే వచ్చాయి. కానీ ‘అవతార్ ’ను మాత్రం అది అధిగమించలేకపోయింది.
మూడేళ్లు గడిచాయి. ఇప్పుడు ‘అవతార్’ ఫ్రాంఛైజీలో మూడో సినిమా, సెకండ్ సీక్వెల్.. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ రిలీజైంది. ‘అవతార్-2’ చూసేసరికే జనాలకు ఒక రకంగా మొహం మొత్తింది. పైగా ‘అవతార్-3’ ట్రైలర్ కూడా అంతగా ఎక్కలేదు. ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద బాగానే పడింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ‘అవతార్’, ‘అవతార్-2’ స్థాయిలో ఆరంభ వసూళ్లు రాలేదు. ఇండియాలో అయితే మూడు వారాల ముందు వచ్చిన ‘దురంధర్’ ఈ శుక్రవారం రోజు సాధించిన వసూళ్లను కూడా అధిగమించలేకపోయింది.
ఇక ఈ చిత్రానికి రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు. మెజారిటీ అభిప్రాయం ఏంటంటే.. విజువల్స్ బాగుంటున్నాయి. కానీ సినిమా బోర్ కొడుతోంది. మూడు గంటల 17 నిమిషాల నిడివిని భరించడం కష్టమని.. నేపథ్యం కొంచెం మారుతున్నప్పటికీ ‘అవతార్’లో ప్రతిసారీ కథ కూడా ఒకేలా ఉంటోందన్న కంప్లైంట్లున్నాయి.
పండోరా గ్రహానికి ప్రమాదం రావడం, మనుషులు దండెత్తి వెళ్లడం.. వారిని నావీలు ఢీకొట్టి గెలవడం.. ఇదే లైన్ మీద కథ నడుస్తోంది. విజువల్స్ బాగున్నాయి కదా అని అందరూ ఈ సినిమాను చూడరు. చూసిన వాళ్లు సంతృప్తి చెందరు. ఈ ఫ్రాంఛైజీ ఇప్పటికే ఓవర్ డోస్ అయిపోయిందని.. ఇక వీటిని ఆపేస్తే మంచిదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ముందే అనౌన్స్ చేసిన మిగతా రెండు సీక్వెల్స్‌ను కామెరూన్ కట్టిపెట్టేస్తే మంచిదేమో.
This post was last modified on December 20, 2025 6:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…