భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకునే సిచువేషన్ వచ్చేసింది. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ వల్ల చాలా కేంద్రాల్లో ఇప్పటికే స్లోగా ఉన్న అఖండ 2 కలెక్షన్లు మరింత దెబ్బ తినబోతున్నాయి. గాయం మీద కారం చల్లినట్టు ఆల్రెడీ దురంధర్ ఎఫెక్ట్ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా తగిలింది. ఇప్పుడు రెండో వీకెండ్ వచ్చేసింది. మూమెంట్ తగ్గకుండా దర్శకుడు బోయపాటి శీను చాలా ట్రై చేస్తున్నారు. తనికెళ్ళ భరణి, సింగర్ సునీత లాంటి ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసి హైప్ పెంచాలని చూస్తున్నారు.
తాజాగా బాలయ్యతో పాటు బోయపాటి వారణాసికి వెళ్లిపోయారు. అక్కడ మీడియాని కలుసుకోవడంతో పాటు నిజమైన అఘోరాలతో సమావేశం కాబోతున్నట్టు తెలిసింది. సాధ్యమైతే వాళ్ళకో షో వేసి అభిప్రాయాలు తీసుకునే పనిలో ఉన్నారట. నిజానికి అఖండ 2 వసూళ్లు నార్త్ లో ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. కానీ కార్తికేయ 2, కాంతార రేంజ్ లో తమ సినిమా ఆడుతుందని భావించిన నిర్మాతలు అక్కడ విస్తృతంగా పబ్లిసిటీ చేశారు. కానీ దానికి భిన్నమైన రిజల్ట్ దక్కింది. అందుకే వీలైనంత పికప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడీ కాశి ట్రిప్ పెట్టుకున్నారు. ఇది ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి.
వచ్చే వారం డిసెంబర్ 25 చాలా రిలీజులు క్యూ కట్టి ఉన్నాయి. ఆలోగా అఖండ 2 ఎంత రాబట్టుకుంటే అంత డ్యామేజ్ తగ్గుతుంది. ఏపీలో చాలా చోట్ల టికెట్ రేట్ల పెంపుని జిఓ ప్రకారం పది రోజుల పాటు కొనసాగిస్తూ ఉండటం చేటు చేస్తోంది. దీన్ని డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు గుర్తించకపోవడం ట్రాజెడీ. అవతార్ 3కి ఏమంత గొప్ప టాక్ రాకపోవడాన్ని అఖండ 2 ఏమైనా వినియోగించుకుంటుందేమో చూడాలి. 3డి వెర్షన్ తో కూడా పెద్దగా పనవ్వలేదు. ఫైనల్ గా అఖండ 2 నష్టం మిగులుస్తుందా లేక గట్టెక్కుతుందా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అయితే బాలయ్య వేగానికి స్పీడ్ బ్రేకరయ్యేలా ఉంది.
This post was last modified on December 19, 2025 12:16 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…