అఖండ-2 సినిమా మీద ఆ చిత్ర బృందమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఒక వారం ఆలస్యంగా రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రాగా.. తొలి వీకెండ్ వరకు వసూళ్లు ఓకే అనిపించాయి. కానీ వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. వీక్ డేస్ రాగానే వసూళ్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. వీకెండ్ తర్వాత డ్రాప్ సహజమే కానీ.. ఈ సినిమాకు మరీ ఎక్కువ డ్రాప్ కనిపించింది.
వారం వాయిదా తర్వాత అఖండ-2 రేట్లను తగ్గించినా సరే.. బయ్యర్లు సేఫ్ జోన్లోకి రాని పరిస్థితి. నైజాం వరకు పర్వాలేదు కానీ.. మిగతా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. ఐతే అఖండ-2కు కాస్త సానుకూలంగా కనిపిస్తున్న విషయం.. ఈ వారం తెలుగు నుంచి క్రేజీ సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. ఉన్నవాటిలో గుర్రం పాపిరెడ్డి కాస్త నోటబుల్ మూవీ. కానీ అది అఖండ-2 మీద ప్రభావం చూపేది కాదు.
కానీ అవతార్-3 రూపంలో బాలయ్య సినిమాకు అడ్డంకి ఉంది. అవతార్ ఫ్రాంఛైజీలో గత రెండు చిత్రాలతో పోలిస్తే దీనికి బజ్ తక్కువే కానీ.. అలా అని కొట్టి పారేసే పరిస్థితి లేదు. ఈ వారానికి ఇదే తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ లీడర్ అనడంలో సందేహం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక మోస్తరుగా జరిగాయి. వీకెండ్లో ఈ సినిమాను జనం బాగానే చూస్తారనే అంచనాలున్నాయి. ఐతే రేప్పొద్దున ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నది చూడాలి.
టాక్ సూపర్ అని వస్తే వీకెండ్లో ఆ సినిమా వసూళ్ల మోత మోగించడం.. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా లీడ్ తీసుకోవడం ఖాయం. రెండో వీకెండ్ నుంచి చెప్పుకోదగ్గ షేర్ వస్తుందని.. నష్టాల భారాన్నితగ్గించుకుందామని అఖండ-2 బయ్యర్లు చూస్తున్నారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఆ చిత్రానికి ఎక్కువగానే స్క్రీన్లు, షోలు కొనసాగుతున్నాయి. మరి అవతార్-3 పోటీని తట్టుకుని ఆ సినిమా రెండో వీకెండ్లో ఏమేర షేర్ రాబడుతుందో చూడాలి. టీం అయితే ఇప్పటికీ ప్రమోషన్లు కొనసాగిస్తోంది. బాలయ్య, బోయపాటి కాశీకి చేరుకుని అక్కడ ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు.
This post was last modified on December 19, 2025 10:30 am
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…