Movie News

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా ఇలాంటి ఈవెంట్లు చేసే నిర్వాహకులు అప్రమత్తం కావడం లేదు. సినీ తారలు వస్తున్నారంటే అక్కడికి పెద్ద ఎత్తున జనం పోగవుతారన్నది తెలిసిన విషయమే. పైగా అది ఓ పెద్ద సినిమాకు సంబంధించిన ఈవెంట్ అంటే.. లీడ్ హీరోయిన్ దానికి హాజరవుతోందంటే.. సోషల్ మీడియాలో ఆ ఈవెంట్ గురించి ఎక్కువ ప్రచారం జరిగితే ఇక జనాన్ని అదుపు చేయడం చాలా కష్టం. పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోతే అంతే సంగతులు. 

నిన్న ‘రాజాసాబ్’ రెండో పాట లాంచ్ కోసం హైదరాబాద్ కూకటపల్లిలోని ‘లులు మాల్’లో చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లోపంతో అస్తవ్యస్తంగా తయారైంది. హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఈవెంట్ వేదిక నుంచి బయటికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బంది తలెత్తింది. జనం మధ్య నలిగిపోయిన నిధి.. ఒక దశలో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంది. కార్లోకి ఎక్కాక ఆమె అసహనం, నిట్టూర్పు చూస్తే అర్థమైపోతుంది నిధి ఎంత ఇబ్బంది పడిందన్నది. 

ఐతే ఇలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఆమె సంయమనం కోల్పోలేదు. అసలు ఒక మాల్‌లో ఓపెన్ ఏరియాలో ఎలాంటి బారికేడ్స్ కూడా లేకుండా ఒక స్టార్‌ హీరోయిన్‌ను తీసుకొచ్చి పెద్ద ఈవెంట్ చేయడం అన్నది ఎంత పెద్ద రిస్కో నిర్వాహకులు ఆలోచించకపోవడం దారుణం. ఇందులో ఆర్గనైజర్స్ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. ఈ నేపథ్యంలో నిధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టి నిర్వాహకుల తీరును నిధి ఎండగడుతుందేమో.. మీడియాతో దీని గురించి మాట్లాడుతుందేమో అనుకున్నారంతా. కానీ ఆమె అలా చేయలేదు. ‘సహానా’ పాటను సోషల్ మీడియాలో లాంచ్ చేసింది. 

తన సినిమాల ప్రమోషన్ల కోసం నిధి ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం అనేక ఈవెంట్లలో పాల్గొంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆమె కష్టం గురించి చెబుతూ, అలా ప్రమోట్ చేయకపోవడం తనకు సిగ్గుగా అనిపిస్తోందన్నారు. ఇప్పుడు ‘రాజాసాబ్’ ప్రమోషన్లలో కూడా నిధినే లీడ్ తీసుకుంది. ఇందులో ఇంకో ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ నిధినే ముందుగా ప్రమోషన్లకు హాజరైంది. ప్రభాస్ అందుబాటులో లేకపోయినా తాను సినిమాను ప్రమోట్ చేయాలనుకుంది. కానీ అనుకోని పరిణామంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. అయినా సరే ఆమె ప్రమోషన్లకు దూరమయ్యేలా లేదు. 

This post was last modified on December 18, 2025 10:49 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

18 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago