Movie News

ప్రభాస్‍ వాళ్లకు హ్యాండ్‍ ఇచ్చేసినట్టేనా?


ప్రభాస్‍ ప్రస్తుతం మూడొందల కోట్ల పైచిలుకు బడ్జెట్‍ పెట్టగల నిర్మాతల కోసమే చూస్తున్నాడు. అందుకే ఆదిపురుష్‍, సలార్‍ చిత్రాలను పట్టాలెక్కించాడు. ఆ చిత్రాలకు బిగ్‍షాట్స్ నిర్మాతలు. తెలుగు నిర్మాత అశ్వనీదత్‍ సినిమాను ఓకే చేసి కూడా దానిని వెనక్కు నెడుతున్నాడు. తనకు అడ్వాన్స్ ఇచ్చిన తెలుగు నిర్మాతలను ప్రభాస్‍ ఎంటర్‍టైన్‍ చేయడం లేదు. సాహోతో దెబ్బతిన్న యు.వి. క్రియేషన్స్కి ‘రాధేశ్యామ్‍’ తర్వాత బ్రేక్‍ ఇచ్చేస్తున్నాడు.

నిజానికి కెజిఎఫ్‍ దర్శకుడు ప్రశాంత్‍ నీల్‍కి అడ్వాన్స్ ఇచ్చి అతడిని ప్రభాస్‍ వద్దకు తీసుకెళ్లింది మైత్రి మూవీసే. కానీ అప్పుడీ కాంబినేషన్‍ కుదర్లేదు. తర్వాత ప్రశాంత్‍ నీల్‍ ఈ సలార్‍ ప్రాజెక్ట్ చేద్దామంటే ప్రభాస్‍ గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చాడు. ఈసారి నిర్మాతలు మారిపోయారు. అంటే మైత్రి వాళ్లకు ప్రభాస్‍ హ్యాండ్‍ ఇచ్చేసినట్టేనా? ఇంత భారీ చిత్రాలు తెలుగు నిర్మాతలకు భారం అవుతుందని, దీనికి కార్పొరేట్‍ తరహా సెటప్‍ వున్నవాళ్లే బెస్ట్ అని భావిస్తున్నాడా? ప్రభాస్‍ మాత్రం వచ్చే మూడేళ్ల వరకు మన నిర్మాతలకు దొరికే అవకాశమే లేదు. ఒకవేళ అప్పటికి మనోళ్లతో చేయాలని అనుకున్నా మళ్లీ తన సొంత సంస్థ లాంటి యువిలోనే చేస్తాడు.

ఇదిలావుంటే తెలుగు నిర్మాతలు కూడా తమ పరిధి పెంచుకుని పాన్‍ ఇండియా సినిమాలు తీసే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. మూడు కోట్ల నుంచి మూడొందల కోట్ల వరకు బడ్జెట్‍ అయ్యే సినిమాలను చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా తీసేయాలని డిసైడ్‍ అయ్యారు. ఇందుకోసం కొందరు హేమాహేమీలకు ప్రత్యేక పారితోషికం ఇచ్చి మరీ ప్యానల్‍లో పెట్టుకుంటున్నారు.

This post was last modified on December 10, 2020 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

47 minutes ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

2 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

3 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

4 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

5 hours ago