ఓటిటిలో అందరూ సినిమాలు అమ్ముతోంటే… పే పర్ వ్యూ పద్ధతిలో ఏటిటి ద్వారా సినిమాలు అమ్ముకోవచ్చునని రాంగోపాల్‍వర్మ ఒక ప్రత్యామ్నాయ దారిని చూపించాడు. మోనోపలీ చూపిస్తూ చిన్న సినిమాలను ఓటిటిలు చిదిమేయకుండా ఇది ఒక మంచి మార్గమయి వుండాల్సింది. కానీ వర్మ తన టాలెంట్‍ని దుర్వినియోగం చేసే సినిమాలు తీసినట్టే ఈ టెక్నాలజీని కూడా అసంబద్ధమయిన షార్ట్ సినిమాలతో సదవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. వర్మ తీసిన అడల్ట్ వీడియోలకీ యూట్యూబ్‍లో తీసే అలాంటి వీడియోలకీ తేడా లేదని జనం తిట్టుకున్నారు.
ఇదిలావుంటే ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా విజయం కోసం డర్టీ హరి అనే ఒక అడల్ట్ కంటెంట్ వున్న సినిమా తీసాడు. ఆయన సదరు చిత్రాన్ని అడల్ట్ సినిమాగానే ప్రమోట్ చేస్తూ వచ్చి రిలీజ్‍కి దగ్గర పడిన ఈ టైమ్‍లో థ్రిల్లర్ కలర్ ఇస్తున్నాడు. రాంగోపాల్‍వర్మ తీసిన వీడియోల మాదిరి సినిమానే ఇది కూడా అంటారనేది రాజుగారి భయమట.
అందుకే ఎరోటిక్ థ్రిల్లర్ అనే సంగతి తెలియడానికి ఈసారి థ్రిల్లర్ అంశాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కూడా అలా పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదలవుతోంది. థియేటర్లు తెరిచినా కానీ అలా కంటే ఇదే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. మరి ఎంత మంది జనం ఆన్‍లైన్‍లో కొని మరీ ఈ సినిమా చూస్తారనేది విడుదలయితే తప్ప చెప్పలేం.
This post was last modified on December 9, 2020 11:41 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…