ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది అతడికే. కానీ ఎనిమిదేళ్ల కిందట ఒక నటి మీద ఒక గ్యాంగ్‌తో లైంగిక దాడి చేయించినకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడంతో దిలీప్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఈ కేసులో కొన్ని నెలలు జైల్లో కూడా ఉన్నాడు దిలీప్. ఐతే ఇటీవలే ఈ కేసులో కోర్టు తీర్పు రాగా.. దిలీప్ నిర్దోషి అని తేలింది.
ఈ విషయమై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి. దాడి చేసిన వాళ్లకు శిక్ష పడ్డప్పటికీ.. ఆ దాడి చేయించిన అసలు నిందితుడిని వదిలేశారంటూ బాధిత నటితో పాటు చాలామంది ఆక్రోశం వెళ్లగక్కారు. కోర్టు తీర్పు విషయమై కొన్ని వారాలుగా నిరసనలు కొనసాగుతూ ఉండగానే దిలీప్ కొత్త సినిమా భభబ విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది. ఐతే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
ఇటీవల కేరళ ఆర్టీసీ బస్సులో దిలీప్ సినిమా ఒకటి ప్రసారం చేయగా.. బస్సులో ఉన్న మహిళలు ఆ చిత్రాన్ని ఆపాలంటూ గొడవ గొడవ చేయగా.. కండక్టర్ చేసేదేమీ లేక ఆ సినిమాను మార్చాల్సి వచ్చింది. దీని గురించి వార్త మీడియాలో హైలైట్ అయింది. దిలీప్ పట్ల కేరళ మహిళల్లో ఉన్న ఆగ్రహం ఎలాంటిదో చెప్పడానికి ఇది ఉదాహరణ.
తన కొత్త సినిమా విషయంలో కూడా ఇదే వ్యతిరేకత కనిపిస్తోంది. మహిళలు అనే కాక పురుషుల్లోనూ ఒక వర్గం తన సినిమాలను వ్యతిరేకిస్తోంది. ఈ కేసు విషయంలో బాధిత నటికి అన్యాయం జరిగిందని.. ఆమెపై దాడికి సూత్రధారి దిలీపే అయినా అతను నిర్దోషిగా బయటపడడం దారుణమని వారు మండిపడుతున్నారు.
భభబ సినిమాలో మలయాళ టాప్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్ర చేయడం గమనార్హం. ఇందుకుగాను ఆయన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందులో మరో పాత్ర చేసిన వినీత్ శ్రీనివాసన్ మీద కూడా మండిపడుతున్నారు. థియేటర్ల ముందు కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇంత వ్యతిరేకత మధ్య రిలీజవుతున్న భభబ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on December 18, 2025 9:03 am
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…