దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా వసూళ్లు తగ్గిపోతాయి. అందులోనూ పన్నెండో రోజు అంటే చెప్పనక్కర్లేదు. కానీ రణ్వీర్ సింగ్ మూవీ దీనికి అతీతంగా రికార్డులు బద్దలు కొడుతోంది. రోజుకు కనీసం పాతిక నుంచి ముప్పై కోట్లకు పైగా వసూలు చేయనిదే ఊరుకోను అనే స్థాయిలో నానా భీభత్సం చేస్తున్నాడు. ఉత్తరాది ట్రేడ్ సమాచారం ప్రకారం ఇప్పటిదాకా నాలుగు వందల యాభై కోట్ల నెట్ సాధించిన దురంధర్ గ్రాస్ రూపంలో ఏడు వందల కోట్లవైపు వేగంగా పరుగులు పెడుతున్నాడు.
శుక్రవారం అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదల కానుంది. దీనికున్న క్రేజ్ తెలిసిందే. మాములుగా అయితే మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దీనికి ఎక్కువ షోలు వేసి మిగిలిన వాటికి నామమాత్రంగా కేటాయిస్తారు. దీన్ని కూడా దురంధర్ బ్రేక్ చేశాడు. అంత పెద్ద గ్రాండియర్ వస్తున్నా సరే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉండటం దురంధర్ స్టామినాకు నిదర్శనం. నార్త్ లో అఖండ 2 అంత దారుణంగా పోవడానికి కారణం ఇదేనని వేరే చెప్పనక్కర్లేదు. కంటెంట్ సంగతి పక్కనపెడితే కనీస రీచ్ రాకపోవడం వెనుక రీజన్ ఒకటే. దురంధర్ మేనియాలో ఆడియన్స్ దేన్నీ పట్టించుకునే స్టేజిలో లేరు.
ఇప్పుడు అసాధ్యమేమో అనుకున్న వెయ్యి కోట్ల మార్కును దురంధర్ సులభంగా దాటేసేలా ఉన్నాడు. ఈ లాంఛనం క్రిస్మస్ లోపే జరిగినా ఆశ్చర్యం లేదు. ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ చేసే ప్లాన్ లో ఉందట. ఈ డేట్ లీకైపోయినా సరే జనం థియేటర్లకు వెళ్లడం మానుకోవడం లేదు. యానిమల్, చావాలను అలవోకగా దాటేస్తున్న దురంధర్ ఫైనల్ ఫిగర్స్ ఎంత పెడతాడో అని బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. దీని దెబ్బకు మార్చ్ 19 విడుదల కావాల్సిన దురంధర్ 2 వాయిదా పడొచ్చట. అన్నీ పక్కాగా చూసుకుని ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ చేయొచ్చని టాక్.
This post was last modified on December 17, 2025 10:39 pm
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…