రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో సాంగ్ వదిలేశారు. ముందు నుంచి ఆయన చెబుతున్నట్టుగా వింటేజ్ డార్లింగ్ బయటికి వచ్చేలా కాస్ట్యూమ్స్, లొకేషన్స్, టెక్నికల్ వర్క్ పరంగా తీసుకున్న శ్రద్ధ విజువల్స్ లో కనిపించింది. కొన్నేళ్లుగా ప్రభాస్ ని రఫ్ హీరోయిజంలో చూసి చూసి అలవాటైన కళ్ళకు ఇప్పుడీ పాట ఫ్రెష్ గా కనిపిస్తోంది. కృష్ణ కాంత్ సాహిత్యానికి తమన్ కంపోజ్ చేసిన ట్యూన్ స్వీట్ మెలోడీలాగా సాగింది. సర్కారు వారి పాటలో కళావతి ప్యాట్రన్ ఫాలో అయిన తమన్ మరోసారి అదే స్థాయి ఫలితం అందుకునేలా ఉన్నాడు.
హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అందంగా చక్కగా ఉంది. అయితే హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లే స్థాయిలో ఈ పాట ఉందా అంటే వెంటనే చెప్పలేం. ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ కి అంత వేగంగా కనెక్ట్ అయ్యేలా లేదు. స్లో పాయిజన్ తరహాలో మెల్లగా ఎక్కాలి. చికిరి చికిరి, మీసాల పిల్ల టైపులో కాకుండా కొంచెం నెమ్మదిగానే వెళ్లేలా ఉంది. అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ ని ఇంత కూల్ లుక్స్ లో చూసి మురిసిపోతున్నారు. విశాల్ మిశ్ర, శృతి రంజని, తమన్ గాత్రాలు క్వాలిటీకి దోహదపడ్డాయి. మొత్తానికి వినడానికి కన్నా చూసేందుకు ఎక్కువ మార్కులు పడేలా ఉన్నాయి.
ఇక ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ చూసుకుంటే రాజా సాబ్ రెండు పొడవు టీజర్లు, రెండు పాటలు ఇచ్చాడు. జనవరి 9 ఎంతో దూరంలో లేకపోవడంతో ప్రమోషన్ల వేగం పెంచాలని డార్లింగ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అసలే పండగకు వస్తున్న మొదటి సినిమా. యునానిమస్ టాక్ తెచ్చుకుంటే తర్వాత వచ్చే పోటీని తట్టుకోవచ్చు. జనవరి 8నే ప్రీమియర్లు వేస్తామని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం రెట్టింపు అవుతోంది. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ డాన్స్ చేసిన పాట మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. దాన్ని నూతన సంవత్సర కానుకగా ఇస్తారేమో చూడాలి.
This post was last modified on December 17, 2025 10:35 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…