అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య మూవీ ఇకపై అద్భుతాలు చేసే అవకాశాలు తక్కువగా ఉండటంతో క్యూ కట్టిన చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఉన్న వాటిలో ‘గుర్రం పాపిరెడ్డి’ బాగానే సౌండ్ చేస్తోంది. టాక్ బాగుండి, సోషల్ మీడియా సపోర్ట్ దక్కితే పికప్ అవ్వొచ్చని టీమ్ విస్తృతంగా పబ్లిసిటీ చేస్తోంది. ఒక కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందం దగ్గరుండి మరీ ఈవెంట్లకు రావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తుంటే కంటెంట్ మీద నమ్మకమైతే కలుగుతోంది. ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.
పెద్దగా హడావిడి చేయకుండా వస్తున్న ‘సకుటుంబానాం’ అనే చిన్న మూవీ బరిలో ఉంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ మేఘ ఆకాష్ చాలా గ్యాప్ తర్వాత దర్శనమిస్తోంది. యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శోభన్ బాబు ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘సోగ్గాడు’ని సురేష్ సంస్థ గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తోంది. పెద్దగా సౌండ్ చేయడం లేదు కానీ వింటేజ్ ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ ‘శివాజీ’ ఒకరోజు ఆలస్యంగా రీ రిలీజ్ అవుతోంది. తమిళ ఫ్యాన్స్ పడయప్పని సెలెబ్రేట్ చేసుకున్నట్టు మనోళ్లు దీన్ని చూస్తారని నిర్మాత అంచనా కాబోలు. కానీ అంత రెస్పాన్స్ రాకపోవచ్చు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ‘అవతార్ 3 ఫైర్ అండ్ యాష్’ ఇంకోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతోంది. నగరాలు, పట్టణాల్లో దీని డామినేషనే కనిపిస్తోంది. అవతార్ 2 మించిన రెస్పాన్స్ వస్తుందా రాదా అనేది రిలీజ్ రోజు తేలుతుంది కానీ ఇప్పటికైతే టికెట్లు తెగుతున్న సినిమా ఇదొక్కటే. తెలుగు డబ్బింగ్, 3డి ఎక్స్ పీరియన్స్, ట్రైలర్ కంటెంట్ లాంటివి పిల్లా పెద్దాను లాగుతున్నాయి. అఖండ 2 రెండో వారం కొనసాగింపుతో పాటు ఈవారం థియేటర్లను నింపగలిగే కెపాసిటీ ఉన్న మూవీ అవతార్ 3 ఒక్కటే. ముందు చెప్పినవాటిలో ఏవైనా లిటిల్ హార్ట్స్ తరహాలో టాక్ తెచ్చుకుంటే వీకెండ్ కల్లా అవీ పుంజుకుంటాయి.
This post was last modified on December 17, 2025 3:10 pm
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…