తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్ కుమార్. ఈ పేరు అంత పాపులర్ కాకపోవచ్చు. కానీ ఆ దర్శకుడు అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరోతో సినిమా తీశాడు. నాగ్ హీరోగా 2006లో వచ్చిన ‘కేడి’ చిత్రాన్ని కిరణే రూపొందించాడు.
ఐతే ఆ మూవీ ఫ్లాప్ కావడంతో కిరణ్ కెరీర్ ముందుకు సాగలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘క్యూజేకే’ అనే సినిమాను మొదలుపెట్టాడు. దసరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో ఆకట్టుకున్న దీక్షిత్ శెట్టి ఇందులో ఒక హీరో. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల మరో ప్రధాన పాత్ర పోషించాడు. యుక్తి తరేజా కథానాయిక. దసరా, ది ప్యారడైజ్ చిత్రాల నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా కిరణ్ కన్నుమూయడం యూనిట్‌కు పెద్ద షాక్.
‘క్యూజేకే’ సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు. సినిమా చిత్రీకరణ ఒక దశ వరకు బాగానే జరిగింది. కానీ మధ్యలో కిరణ్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కొన్ని నెలల పాటు చిత్రీకరణ ఆగిపోయింది. కిరణ్ కొంచెం కోలుకుని ఈ మధ్యే తిరిగి షూట్‌కు వచ్చాడు. కానీ ఇంతలోనే మళ్లీ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ‘కేడి’ కంటే ముందు అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన ‘యువ’ సీరియల్‌కు పని చేశాడు కిరణ్. తర్వాత అతడికి నాగార్జున ఫీచర్ ఫిలిం డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు.
నాగ్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి వీరి కలయికలో ‘కేడి’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కిరణ్ విభిన్న ప్రయత్నమే చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఇండియాలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాక.. సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేయడం గమనార్హం.
This post was last modified on December 17, 2025 3:01 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…