2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా నాలుగు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్. అందులో తొలి సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూడేళ్ల ముందు రిలీజైంది. కానీ ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సుదీర్ఘ నిడివితో, కొత్తదనం లేని విజువల్స్‌తో ఒకింత బోర్ కొట్టించిందా సినిమా. కానీ ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లకేమీ ఢోకా లేకపోయింది.
‘అవతార్’లో కాకపోయినా భారీ వసూళ్లే సాధించిందీ చిత్రం. ఇప్పుడు కామెరూన్ ‘అవతార్-3’తో రెడీ అయ్యాడు. ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘అవతార్-2’ అనుభవం దృష్ట్యా మూడో భాగం మీద మరీ అంచనాలేమీ లేవు. ఆ సంగతి అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ప్రతిఫలిస్తోంది. దీనికి తోడు ‘అవతార్-3’ రివ్యూలు కూడా అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.
హాలీవుడ్లో ఆల్రెడీ ఈ సినిమాకు ప్రిమియర్స్ పడ్డాయి. రివ్యూలు మోడరేట్‌గా ఉన్నాయి. రోటన్ టమోటాస్ 70 పర్సంట్ రేటింగ్ ఇచ్చింది ఈ చిత్రానికి. అవతార్, అవతార్-2లతో పోలిస్తే మూడో భాగానికి ఆ సంస్థ రేటింగ్ తగ్గించింది. బీబీసీ సైతం ‘అవతార్-3’కి నెగెటివ్ రివ్యూనే ఇచ్చింది. ముఖ్యంగా నిడివి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీబీసీ.. అవతార్ సిరీస్‌ను కామెరూన్ ఇంతటితో ఆపేస్తే బెటరని వ్యాఖ్యానించడం గమనార్హం.
వెరైటీ సంస్థ మాత్రం ‘అవతార్-3’కి పాజిటివ్ రివ్యూ ఇచ్చింది. మిగతా రివ్యూల్లో కొన్ని పాజిటివ్‌గా, కొన్ని నెగెటివ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే మాత్రం మెజారిటీ సమీక్షలు నెగెటివ్‌గానే ఉన్నాయి. విజువల్‌గా బాగుంటున్నప్పటికీ ‘అవతార్’ ఓవర్ డోస్ అయిపోతోందని, 3 గంటలకు పైగా నిడివిని భరించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on December 17, 2025 2:57 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…