బిగ్‍బాస్ సీజన్ 4లో క్రౌడ్ ఫేవరెట్‍గా అవతరించాడు అభిజీత్. క్లాస్, యూత్‍ని అభిజీత్ గెలుచుకున్నాడు. యాంగ్రీ బర్డ్ సోహెల్‍కి మాస్ కనక్ట్ అయ్యారు. అలాగే అరియానా కూడా తన మార్కు అతి చేష్టలతో ఒక వర్గాన్ని ఆకట్టుకోగలిగింది. అయితే అభిజీత్ గెలుపుని కష్టతరం చేయడానికి బిగ్‍బాస్ బృందం కొంతకాలంగా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో బిగ్‍బాస్ కుతంత్రం రచిస్తోందనే అనుమానాలు, అపోహలు సర్కులేట్ అవుతున్నాయి.
అరియానా ఓట్ బ్యాంక్ బలోపేతం చేయడం కోసం ఆమెకి క్లోజ్ అయిన అవినాష్‍ని ఫైనల్‍కి ముందు ఎలిమినేట్ చేసారని, అతను ఎలిమినేట్ అయిన తర్వాత అరియానాకు ఫుల్ స్క్రీన్ టైమ్ ఇస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలోని బిగ్‍బాస్ ప్రోమోలు చూస్తే అది నిజమేననిపిస్తోంది. అరియానా తన కష్టాలను చెప్పుకుంటూ ఒక అమ్మాయిని బిగ్‍బాస్ విజేతను చేయాలని చేసుకున్న విన్నపాన్ని మెయిన్ షోలో చూపించారు. అంతే కాకుండా ఆమెకి ప్రత్యర్ధిలా అనిపిస్తోన్న దేత్తడి హారికను హిప్నటైజ్ చేసి తన ఓట్‍బ్యాంక్‍ను చెల్లాచెదురు చేసారు. హారిక ఎలిమినేట్ అయినా ఆమె ఓట్లు అభిజీత్‍కు పడకుండా చూసుకుంటున్నారు. అలాగే షో టైమింగ్స్ తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు మార్చేసారు. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కొందరు తగ్గిపోతారు. పొద్దున్న ఆన్‍లైన్ క్లాసులవీ వుంటాయి కనుక ఈ వర్గం ఈ టైమింగ్స్ కి అంత తేలికగా షిఫ్ట్ అవలేరు.
ఇదంతా కూడా అభిజీత్‍ని కార్నర్ చేయడానికే అన్నట్టుగా ఫాన్స్ గగ్గోలు పెడుతున్నారు. సోహైల్, అరియానాకు మాత్రమే స్క్రీన్ టైమ్ ఇస్తూ కావాలని అభిజీత్‍ని తక్కువ చేస్తున్నారని, అలాగే హారికను ఎలిమినేట్ చేసే కుతంత్రాన్ని పన్నారని అభియోగాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో బిగ్‍బాస్‍కే తెలియాలి.
This post was last modified on December 9, 2020 11:42 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…