Movie News

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్ అత‌నే. ఇప్ప‌టిదాకా ఎనిమిదీ సినిమాలు తీస్తే ఎనిమిదీ విజ‌య‌వంతం అయ్యాయి. ఎఫ్‌-2 ఓ మోస్త‌రు వ‌సూళ్లు సాధించింది త‌ప్పితే మిగ‌తావ‌న్నీ హిట్లు, సూప‌ర్ హిట్లు, బ్లాక్‌బ‌స్ట‌ర్లే. చివ‌ర‌గా అత‌ను రూపొందించిన సంక్రాంతికి వ‌స్తున్నాం ఏకంగా రూ.300 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం రేపింది.

ఐతే విజ‌యాలు సాధిస్తున్న‌ప్ప‌టికీ.. అనిల్ మీద ఒక వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉంది. అత‌ను రొటీన్ సినిమాలు తీస్తాడ‌ని.. కామెడీ, క్యారెక్ట‌ర్లు క్రింజ్‌గా ఉంటాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. ఈ విమ‌ర్శ‌ల గురించి తాజాగా అనిల్ స్పందించాడు. త‌న సినిమాలు క్రింజ్ అన్నా తాను ప‌ట్టించుకోన‌ని.. అలా ప‌ట్టించుకుంటే హిట్ సినిమాలు తీయ‌లేన‌ని అత‌న‌న్నాడు.

”క్రింజ్ అనే ప‌దం నాతో ప్ర‌యాణం చేస్తూనే ఉంటుంది. సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర‌హాలో ఇంకో ప‌ది బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు అందించినా.. న‌న్ను కొంద‌రు క్రింజ్ డైరెక్ట‌ర్ అనే అంటారు. కానీ అలాంటి వాళ్లు ప‌ది శాత‌మే ఉంటారు. మిగ‌తా 90 శాతం మంది నా సినిమాల‌ను ఎంజాయ్ చేస్తున్న‌పుడు, టికెట్లు కొంటున్న‌పుడు నేను ఆ ప‌ది శాతం గురించి ఎందుకు ఆలోచించాలి? నా నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు సంతోషంగా ఉన్న‌పుడు వీళ్ల‌ను నేనెందుకు ప‌ట్టించుకోవాలి. నా సినిమాల‌ను ఆద‌రిస్తున్న 90 శాతంమంది నన్నువిమ‌ర్శిస్తే అప్పుడు నేను బాధ ప‌డాలి. ఆలోచించాలి. లేదంటే నేను విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు” అని అనిల్ అన్నాడు.

సంక్రాంతికి వ‌స్తున్నాంలో బుల్లిరాజు పాత్ర చేసిన చిన్న పిల్లాడితో బూతులు మాట్లాడించ‌డం గురించి కూడా అనిల్ స్పందించాడు. తాను లెజెండ‌రీ డైరెక్ట‌ర్ జంధ్యాల తీసిన హై హై నాయ‌కా మూవీ నుంచి స్ఫూర్తి పొంది ఆ కామెడీ ట్రై చేశాన‌న్నాడు అనిల్.

ఇప్ప‌టి పిల్ల‌లు యూట్యూబ్ చూస్తూ అలాగే బూతులు మాట్లాడుతున్నార‌ని.. త‌న కొడుకు కూడా అలాగే ఉన్నాడ‌ని.. అత‌ణ్ని మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని.. త‌ల్లిదండ్రుల‌కు ఒక హెచ్చ‌రికలాగా ఈ పాత్ర‌ను డిజైన్ చేశామ‌ని.. ఒక పాత్ర‌తో కొంచెం అతి చేయించ‌డ‌మో, ఇంకోటో చేయ‌కుండా కామెడీ పుట్టించ‌డం క‌ష్ట‌మ‌ని అనిల్ అన్నాడు. జ‌నాలు బుల్లిరాజు పాత్ర‌ను ఆద‌రించార‌ని.. అత‌ణ్ని స్టార్‌ను చేశారని.. వాళ్లు క‌నెక్ట్ కాక‌పోతే అత‌డికంత పేరు వ‌చ్చేదా అని అనిల్ ప్ర‌శ్నించాడు.

This post was last modified on December 15, 2025 10:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

33 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago