బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ముందు హీరోయిన్ గా శ్రీలీలను తీసుకుని కొంత భాగం షూట్ అయ్యాక ఆ స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని రీప్లేస్ చేయడం విదితమే. నిజానికి లెనిన్ విడుదల ఈ ఏడాదే ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ నిర్మాణంలో ఆలస్యంతో పాటు క్వాలిటీ కోసం నాగార్జున కట్టుబడటంతో నెమ్మదిగానే వెళ్తున్నారు. అయితే అఖిల్ పాత్రకు సంబంధించి ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
హీరోలు అంధులుగా నటించడం చాలా అరుదు. ఇప్పటి జనరేషన్ లో రవితేజ మాత్రమే రాజా ది గ్రేట్ లో ఫుల్ లెన్త్ బ్లైండ్ మ్యాన్ గా నటించి మెప్పించాడు. అంతకు ముందు కమల్ హాసన్ అమావాస్య చంద్రుడు లాంటివి కొన్ని ఉన్నాయి కానీ ఇంత రిస్క్ చేసిన వాళ్ళు తక్కువే. ఇప్పుడీ లెనిన్ లో అఖిల్ చూపులేని వాడిగా కనిపిస్తాడని వినికిడి. సినిమా మొత్తమా లేక కొంత భాగానికి పరిమితమా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. వినరో భాగ్యాము విష్ణు కథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న లెనిన్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. ఇంటెన్స్ లవర్ స్టోరీగా చెబుతున్నారు.
ఇది అఫీషియల్ గా చెప్పింది కాదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ నిజమైతే మాత్రం అభిమానులకు సూపర్ కిక్ అవుతుంది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే హీరోలు మరింత మెరుగవుతారు. అది కూడా అఖిల్ కు చిన్న వయసులోనే రావడం విశేషమే. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. షూటింగ్ మొత్తం అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే సమయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. 2026 సమ్మర్ అనుకుంటున్నారట. పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, ప్యారడైజ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటితో వీలైనంత క్లాష్ లేకుండా చూస్తారట.
This post was last modified on December 14, 2025 6:23 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…