నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి వారంలోనే విడుదల కావాల్సిన సినిమాకు తమిళనాడు కోర్టు విధించిన ఆంక్షల కారణంగా బ్రేకులు పడ్డాయి. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ గండం నుంచి ఏదో ఒక విధంగా బయటపడ్డామని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా తెలంగాణ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది.
రెండో విడత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపు (శుక్రవారం-12-12) సినిమా రిలీజ్ కానుంది. దీనికి ముందు 11వ తేదీ(గురువారం) రాత్రి ప్రీమియర్‌షో ప్రదర్శనకు సినిమా రెడీ అయింది. అయితే.. ఈ షో టికెట్ల ధరలను పెంచడం.. అదేవిధంగా రెగ్యులర్ షోలకు కూడా టికెట్ ధరలనురూ.50, రూ.100 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిని విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం అలా ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నిస్తూ.. సదరు పిటిషనర్ అభ్యర్థన మేరకు.. టికెట్ల ధరలుపెంచుకునేందుకు ఇచ్చిన జీవోను రద్దు చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ ప్రభావం సినీ అభిమానులపై ముఖ్యంగా నిర్మాతలపై ఎక్కువగా పడనుంది. ఈ నేపథ్యంలో ఎంతో ఖర్చు చేసి ప్రీమియర్ షోన్‌ను ప్రదర్శించే విషయంపై నిర్మాతలు తర్జన భర్జనలో పడ్డారు.
ఈ ప్రీమియర్ షోల విషయంలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు శుక్రవారం కోర్టు విచారణ ప్రారంభమయ్యే సరికి రెగ్యులర్ షో ప్రారంభమైపోతుంది. ఈ నేపథ్యంలో దీనిని కూడా వాయిదా వేస్తారా? అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు తీర్పు వచ్చే వరకువెయిట్ చేయడం అంటే.. పెద్ద సవాలే. మరి ఏం చేస్తారన్నది చూడాలి.
This post was last modified on December 11, 2025 5:03 pm
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
పార్టీ మెప్పు కోసమో.. తమ ప్రాపకం కోసమో.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తెగ రెచ్చిపోతుంటారు. వేదిక దొరికితే చాలు…