ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం మోతాదు హద్దులు దాటిపోయి ఉండాలి. లేదంటే డైలాగులు, సన్నివేశాల్లో వల్గారిటీ ఎక్కువుండాలి. కానీ ఇవేవీ లేకపోయినా తమ సినిమా ‘మోగ్లీ’కి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిందని.. అందుకు ఇందులో ముఖ్య పాత్రధారుల ఇంటెన్స్ యాక్టింగే కారణమని అంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
‘‘సినిమా విషయానికి వస్తే చాలామందికి ఒక అనుమానం ఉంది. ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. ‘ఎ’ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారో రారో అనుకుంటున్నారు. టైటిలేమో ‘మోగ్లీ’ అని పెట్టి, సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ వస్తే ఎలా అంటున్నారు. సాధారణంగా సినిమాలో రక్తపాతం ఎక్కువ ఉన్నా, వల్గారిటీ ఉన్నా ‘ఎ’ ఇస్తారు. ఆ సన్నివేశాలను తీసేయడమో, బ్లర్ చేయడమో చేయొచ్చు. కానీ అదృష్టమో, దురదృష్టమో కానీ.. ‘ఎ’ రావడానికి ఇందులో ఇంటెన్స్ యాక్టింగే కారణం.
బండి సరోజ్‌ను నేరుగా చూడడానికి, కెమెరా ముందు చూడడానికి చాలా తేడా ఉంది. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే నటనలోని తీవ్రతను ప్రేక్షకులు ఫీలవుతారు. సరోజ్ ఎదురుగా ఉండగా రోషన్ ఎలా నటించాడో తెలియదు’’ అని విశ్వ ప్రసాద్ అన్నారు.
‘కలర్ ఫొటో’తో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్.. తన రెండో ప్రయత్నంగా ‘మోగ్లీ’ని రూపొందించాడు. సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటించాడు. కొత్తమ్మాయి సాక్షి కథానాయిక. బండి సరోజ్ విలన్ పాత్ర చేశాడు. శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ‘అఖండ-2’ వల్ల ఫిబ్రవరికి వాయిదా వేయాలని ఓ దశలో అనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మార్చుకుని ఒక్క రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
This post was last modified on December 11, 2025 10:06 am
గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…
భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం…
చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది... అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా…
హైదరాబాద్లోని చరిత్రాత్మక విశ్వవిద్యాలయం.. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావులను మాత్రమే ఈ దేశానికి అందించడం కాదు.. అనేక ఉద్యమాలకు…
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. గత 2020-21 మధ్య జరిగిన…