Movie News

అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?

డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ చేసేస్తున్నారు. 12 సినిమాకు అఫీషియల్ రిలీజ్ డేట్ కాగా.. 11న రాత్రి సెకండ్ షోతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ఆ షోలు పడడానికి మధ్యలో ఒక్క రోజే గ్యాప్ ఉంది. కాబట్టి బుకింగ్స్ త్వరగా ఓపెన్ చేసేయాలి. 

ఏపీలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోల కోసం జీవో తెప్పించుకోవడంలో ఏం ఆలస్యం జరగలేదు. ఇలా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. అలా జీవో వచ్చేసింది. ముందే అప్లికేషన్ పెట్టుకుని అన్నీ చకచకా చేయించేసుకున్నారు. పాత జీవోనే డేట్లు మార్చి ఇచ్చారని స్పష్టమవుతోంది. రేట్లు, షోల విషయంలో ఏం తేడా లేదు. కానీ తెలంగాణ పరిస్థితి ఏంటన్నదే ఇంకా తేలలేదు. 

గత వారం ‘అఖండ-2’ రిలీజ్ డేట్ కంటే మూడు రోజుల ముందే ఏపీ జీవో వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరిగాయి. కానీ నైజాం జీవో కోసం వెయిట్ చేసి చేసి అలసిపోయారు అందరూ. అది రావడంలో ఆలస్యం జరగడంతో ప్రిమియర్స్ డే మధ్యాహ్నం తర్వాత కూడా నైజాం బుకింగ్స్ మొదలు కాలేదు. ప్రిమియర్స్ అనే కాక మొత్తంగా బుకింగ్స్‌నే హోల్డ్ చేసి పెట్టారు. దాని వల్ల బుకింగ్స్ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి కనిపించింది. చివరికి సాయంత్రం 5 తర్వాత జీవో వచ్చింది. అప్పుడే ఫైనాన్స్ వివాదం ముదరడంతో బుకింగ్స్ ఎంతకీ మొదలు కాలేదు. చివరికి సినిమా వాయిదా పడిపోయింది. 

ఇక వర్తమానంలోకి వస్తే.. రేపు రాత్రి సెకండ్ షోలతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయంటే కనీసం ఒక రోజు ముందైనా బుకింగ్స్ మొదలు కావాలి. అంటే మరి కొన్ని గంటల్లో తెలంగాణ జీవో కూడా వచ్చేయాలి. ఏపీలో ఆల్రెడీ బుకింగ్స్ మొదలైపోయాయి. అవి జోరుమీదున్నాయి. ఈసారైనా ప్రభుత్వంలో గట్టిగా లాబీయింగ్ చేసి త్వరగా జీవో వచ్చేట్లు చూడాలని.. లేదంటే ప్రిమియర్స్ ఫుల్ కావడం కష్టమని.. మొత్తంగా బుకింగ్స్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on December 10, 2025 2:11 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Akhanda 2

Recent Posts

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

13 minutes ago

అమెరికాలో ఆగని లోకేష్ వేట

పెట్టుబ‌డిదారులకు ఏపీ స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌ని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప‌ర్యటన‌లో ఉన్న మంత్రి.. పెట్టుబ‌డి దారుల‌తో…

2 hours ago

జైలులో ఉన్న హీరో అంటే ఇంత పిచ్చి ఉందా

స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో…

2 hours ago

క్రేజీ వెంకీ… ఆదర్శ కుటుంబంలో AK 47

అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా…

4 hours ago

డేంజర్ జోన్లో జపాన్‌.. 2 లక్షల మందికి ముప్పు?

జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…

6 hours ago

చిరును పిల‌వ‌డానికి మంత్రులు వెళ్లేస‌రికి…

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌స్తుతం అన‌ధికార పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఒక‌ప్పుడు దాస‌రి నారాయ‌ణ‌రావులా ఇప్పుడు…

6 hours ago