Movie News

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు వస్తుందేమో అనుకుంటే ఫ్యాన్స్ డిమాండ్ కు తలొగ్గో లేక ఇంకేదైనా కారణాల వల్లో ఏదైతేనేం ఫైనల్ గా డిసెంబర్ 12 లాక్ చేసుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోగా యుఎస్ లో కూడా మంచి పికప్ కనిపిస్తోంది. అయితే హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇదే డేట్ కి రావాలనుకున్న రిలీజులు ఇబ్బందిలో పడ్డాయి. సైక్ సిద్దార్థ్ ఏకంగా జనవరి 1కి వెళ్లిపోగా ఈషా డిసెంబర్ 25 వైపు చూస్తోంది. మోగ్లీ కూడా ఇదే రూటు పడుతుందేమో అనుకున్నారు కానీ ఫైనల్ గా పోటీకి సిద్ధపడింది.

ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13 మన ప్రేక్షకులను మోగ్లీ పలకరించబోతున్నాడు. ఇది టీమ్ కు పెద్ద సవాల్ లాంటి ప్రాజెక్టు. ఎందుకంటే దర్శకుడు సందీప్ రాజ్ మొదటి సినిమా కలర్ ఫోటో నేరుగా ఓటిటిలో వచ్చింది. జాతీయ అవార్డు వచ్చినా దాని థియేటర్ స్టామినా ఏంటో బయట పడలేదు. అందుకే మోగ్లీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావడంతో బడ్జెట్ కూడా ఎక్కువే అయ్యింది. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాలకు గతంలో డెబ్యూ మూవీ బబుల్ గమ్ ఫ్లాప్ అయ్యింది. తన ఆశలన్నీ మోగ్లీ  మీదే ఉన్నాయి. బాగా కష్టపడ్డాడు కూడా.

ఇప్పుడు నేరుగా అఖండ 2ని ఢీ కొట్టడం మోగ్లీ  ముందున్న అతి పెద్ద పరీక్ష. ఎందుకంటే బాలయ్య మూవీకి హిట్ టాక్ వస్తే ఆపడం కష్టం. జనాల అటెన్షన్ అంతా దానివైపే వెళ్తుంది. ప్రమోషన్లకు ఎక్కువ టైం లేకపోవడంతో మోగ్లీ  ఉన్నంతలో పబ్లిసిటీ బాగానే చేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దాన్ని పెంచే ప్లాన్ చేసుకుంది. ఇవి ఎక్కువ ఫలితం ఇస్తాయని చెప్పలేం కానీ ఫైనల్ గా కంటెంట్ తో మెప్పిస్తేనే నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ రెండు వారాలుగా బాక్సాఫీస్ డ్రైగా ఉంది కాబట్టి అఖండ 2తో పాటు మరో సినిమాకు స్కోప్ ఉంది. ఇప్పుడా స్లాట్ ని మోగ్లీ సరైన రీతిలో వాడుకుంటే చాలు.

This post was last modified on December 10, 2025 3:08 pm

Share

Recent Posts

ఆ ప్రాజెక్టు ఆపాలని జగన్ కు కేసీఆర్ వార్నింగ్: హరీష్ రావు

ఏపీ మాజీ సీఎం జగన్ కు కృష్ణా జలాలు అప్పణంగా ఆంధ్రాకు తరలించేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని…

10 seconds ago

ఒక్కరోజులో 3 లక్షల కోట్ల లాభం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ ప్రముఖ టెక్ కంపెనీల విలువతో పాటు వాటి అధినేతల…

34 minutes ago

శ్రీవిష్ణు పంచులు పాజిటివ్‌గా వెళ్తున్నాయా

నిన్న విడుదలైన ఫ్యామిలీ ప్యాక్ టీజర్లో శ్రీవిష్ణు వేసిన కొన్ని పంచులు, ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్…

60 minutes ago

గుడివాడ మ‌రో `తాడిప‌త్రి` అవుతోందా?

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లో రాజ‌కీయ వేడి పెరుగుతోంది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో వైసీపీ…

1 hour ago

డింపుల్ హయతికి పెళ్లయిందా?

డింపుల్ హయతి.. ఈ పేరు చూస్తే ఎవరో నార్త్ అమ్మాయి అనుకుంటాం. కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయే అనే…

1 hour ago

దేశంలో హాట్ టాపిక్:  ఏంటీ `తిరుప‌రంకుండ్రం` క‌థ‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు దారితీసిన అంశం. సుప్రీంకోర్టులోనూ విచార‌ణ‌కు కీల‌క ప్రాధాన్యం ఏర్ప‌డిన అంశం.. త‌మిళ‌నాడులోని `తిరుప‌రంకుండ్రం`. గ‌త…

2 hours ago