అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ విడుదల చేసింది. ముందు నుంచి చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 అని ఫిక్స్ చేశారు. ఉపశీర్షికగా ఏకే 47 అని పెట్టడం ద్వారా ఏదో క్రైమ్ టచ్ ఉన్న క్లూ అయితే ఇచ్చారు. వినడానికి ఏదో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటి పేరులా అనిపిస్తున్నా స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కించడం త్రివిక్రమ్ స్టైల్. అల వైకుంఠపురములో టైంలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. తర్వాత ఏమైందో తెలిసిందే.
త్రివిక్రమ్ మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. అతడు, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురం సరసన ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా చేరనుంది. కేవలం ఎంటర్ టైన్మెంటే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించిన వైనం కనిపిస్తోంది. వెంకటేష్ ఎప్పటిలాగే కూల్ అండ్ స్మార్ట్ గా కనిపించగా ఇతర క్యాస్టింగ్ ఎవరిని రివీల్ చేయలేదు. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కన్ఫర్మ్ కాగా సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించబోతున్నట్టు సమాచారం. అయితే వీటిని అఫీషియల్ గా ఖరారు చేయలేదు. త్వరలోనే సరైన సమయం చూసి వీటిని రివీల్ చేసే అవకాశం ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ తర్వాత వెంకటేష్ పరుగులు పెట్టడం లేదు. నెలల తరబడి గ్యాప్ తీసుకుని మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ క్యామియో చేశారు. దృశ్యం 3 రీమేక్ కు సంబంధించి ఇంకా సాలిడ్ అప్డేట్ రావాల్సి ఉంది. ఆదర్శ కుటుంబం సమ్మర్ రిలీజ్ అన్నారు కాబట్టి ఏప్రిల్ కంతా షూటింగ్ పూర్తయిపోతుంది. బడ్జెట్ పరంగా వందల కోట్లు డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు కనక టార్గెట్ ని చేరుకోవడం ఈజీనే. పెన్నుతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ వెంకటేష్ కు ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి డైరెక్షన్ తో ఎలాంటి అద్భుతం చేస్తారో వేచి చూడాలి.
This post was last modified on December 10, 2025 10:45 am
స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో…
జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…
తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అనధికార పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఒకప్పుడు దాసరి నారాయణరావులా ఇప్పుడు…
గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ…
చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే…
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…