అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే అయినా నిర్మాతల నుంచి అధికారిక కన్ఫర్మేషన్ లేకపోవడంతో అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఇతర మీడియం బడ్జెట్ సినిమాలు ప్రమోషన్లు ఆపేసి కూచున్నాయి. ఒకవేళ బాలయ్య వస్తే థియేటర్లు, ఓపెనింగ్స్ పరంగా ఇబ్బందవుతుంది కాబట్టి ఎందుకొచ్చిన తలనెప్పిలెమ్మని సైలెంట్ గా ఉన్నారు. సరే అఖండ ఎల్లుండి విడుదల ఫిక్స్ అయిపోదాం కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి టెన్షన్ లేకుండా వస్తోంది అన్నగారు వస్తారు మాత్రమే. శుభ్రంగా శుక్రవారం థియేటర్లకు వచ్చేస్తోంది.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసేశారు. నిజానికి అన్నగారు వస్తారుకి అఖండ 2 వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని ప్రధాన టార్గెట్ తమిళ మార్కెట్. ఇక్కడ ఎంత వచ్చినా బోనస్ అవుతుంది. ఒకవేళ హిట్ టాక్ వస్తే ఎలాగూ మన ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి ఆ ధీమాతోనే పోటీ గట్రా లెక్కలు వేసుకోలేదు. లేదంటే ఇంకో వారం ఆగి తెలుగు వెర్షన్ విడుదల చేసేవాళ్ళు. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన అన్నగారు వస్తారు కమర్షియల్, ఎక్స్ పరిమెంట్ ఇలా రెండు అంశాలను మేళవించుకుని ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెబుతున్నారు.
కార్తీకి ఇది హిట్ కావడం చాలా అవసరం. గత కొన్నేళ్లుగా సోలో హీరోగా చెప్పుకోదగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. పొన్నియన్ సెల్వన్ తమిళంలో హిట్ అయ్యింది కానీ అది మల్టీస్టారర్ కావడం వల్ల తన భాగం పరిమితం అయ్యింది. అన్నగారు వస్తారు కూడా బాగా లేట్ అవుతూ వచ్చిన ప్రాజెక్టు. నిర్మాణంలో ఆలస్యంతో పాటు కంగువ ఎఫెక్ట్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ మరింత జాప్యానికి గురయ్యింది. ఎట్టకేలకు మోక్షం దక్కింది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సైతం దీని మీద చాలా నమ్మకం పెట్టుకుంది. తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఒత్తిడిలో ఉంటే అన్నగారు వస్తారు మాత్రం ఇంత కూల్ గా ఉండటం వెరైటీ.
This post was last modified on December 9, 2025 9:25 pm
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…
రామాయణం నేపథ్యంలో ఇప్పటికే ఇండియాలో బహు భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆ కథకు ఇప్పటికీ డిమాండ్ తక్కువేమీ…
కరుడుగట్టిన నేరస్తులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటమే కాదు.. తమకు ఎదురు లేదు.. తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. అచ్చొచ్చిన అంబోతుల మాదిరి…