టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్ అనే కాదు.. ఇండియా మొత్తంలోనే టాలెస్ట్ హీరోల్లో అతను ఒకడు. తెలుగు సినీ పరిశ్రమ వరకు ప్రభాస్ తర్వాతి స్థానం మహేష్ బాబుకే ఇవ్వాలి. అతను సరిగ్గా ఆరడుగుల ఎత్తు ఉన్నాడు. కానీ తాను పని చేసిన పొడవైన హీరోల లిస్టు చెబుతూ.. బాలీవుడ్ భామ కృతి సనన్ మహేష్ బాబు పేరు చెప్పడం మరిచిపోవడం సూపర్ స్టార్ అభిమానులకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహాన్నీ కలిగిస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కృతి.. ఇటీవలే ‘తేరే ఇష్క్ మే’ చిత్రంతో పెద్ద హిట్ కొట్టింది. ధనుష్ సరసన కృతి నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇందులో కృతి అందం, అభినయం రెంటితోనూ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ ఆమెతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా కృతి హైట్ గురించి చర్చ వచ్చింది. మీరు చాలా పొడవున్నారని మాట్లాడుతూ.. మీతో కలిసి నటించిన హీరోల్లో చాలామంది మీ కంటే పొట్టివాళ్లు కదా అని అడిగారు భరద్వాజ్.
ఈ ప్రశ్నకు బదులిస్తూ.. అవును, నా హీరోలు చాలామంది నా కంటే ఎత్తు తక్కువ అని చెప్పుకొచ్చింది కృతి. ఈ క్రమంలో తాను కలిసి నటించిన వాళ్లలో ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే తన కంటే పొడవైన వాళ్లని చెప్పింది కృతి. కానీ తాను మహేష్ బాబుతో కలిసి నటించిన విషయమే కృతి మరిచిపోయినట్లుంది. బాలీవుడ్లో వెలిగిపోవడానికి ముందే ఆమె మహేష్ మూవీ ‘1 నేనొక్కడినే’తో అరంగేట్రం చేసింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా సరే.. కృతికి మంచి పాత్ర దక్కింది. ఆమె నటనకు ప్రశంసలూ దక్కాయి.
సినిమా ఆడకపోయినా మహేష్ లాంటి టాప్ స్టార్‌తో తొలి చిత్రం చేయడం చాలా స్పెషల్. అలాంటి చిత్రాన్ని, మహేష్‌ను కృతి ఎలా మరిచిపోయిందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పొరపాటునే అయినప్పటికీ మహష్‌ను ఇగ్నోర్ చేయడం ఆయన అభిమానులు నచ్చక కృతిని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెస్పాన్స్ చూశాక కృతి.. మహేష్ పేరు మరిచిపోవడం గురించి ఒక ట్వీట్ వేస్తే ఆశ్చర్యం లేదు.
This post was last modified on December 9, 2025 8:54 am
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…