తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి, పరిమిత బడ్జెట్లో అతను తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఓటీటీలోకి వచ్చాక ఆ చిత్రానికి కల్ట్ స్టేటస్ దక్కింది. రెండో చిత్రానికి నాని లాంటి హీరో దొరికాడు. బడ్జెట్ కూడా పెరిగింది. ఈసారి ‘జెర్సీ’ రూపంలో ఇంకా గొప్ప సినిమాను అందించాడు.
ఆ తర్వాత ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఆ సినిమా అక్కడ సరిగా ఆడకపోయినా.. గౌతమ్‌కు మాత్రం మంచి పేరే వచ్చింది. నాలుగో సినిమాను ఏకంగా రామ్ చరణ్‌తో చేసే అవకాశం అందుకున్నాడు గౌతమ్. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ముందుకు కదల్లేదు. అయినా సరే.. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో పెద్ద బడ్జెట్లో సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ చిత్రమే.. కింగ్డమ్.
‘కేజీఎఫ్’ తరహాలో భారీ కథను తయారు చేసుకుని.. రెండు భాగాలుగా సినిమా చేయడానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకున్నాడు గౌతమ్. ప్రోమోలు చూస్తే ఈసారి అతను సంచలనం రేపుతాడనిపించింది. కానీ ‘కింగ్డమ్’ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాలో కొన్ని మెరుపులున్నప్పటికీ.. ఓవరాల్‌గా నిరాశ తప్పలేదు.
గౌతమ్ తన స్టయిల్లో సినిమాలు తీసుకోక.. ‘కేజీఎఫ్’ లాంటి చిత్రాలను అనుకరించబోయి దెబ్బ తిన్నాడనే అభిప్రాయం కలిగింది. ఈ సినిమా రిలీజ్ టైంలో ‘కింగ్డమ్-2’ కూడా ఉంటుందనే చర్చ జరిగింది. నిర్మాత నాగవంశీ కూడా అందుకు కట్టుబడే ఉన్నాడు. కానీ తర్వాత అన్నీ ఆలోచించుకుని పార్ట్-2 ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
ఈ విషయంలో ఇటీవలే గౌతమ్‌కు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. విజయ్ సైతం పార్ట్-2 విషయంలో నో చెప్పేసినట్లు సమాచారం. ‘కింగ్డమ్’ తర్వాత గౌతమ్‌కు డిమాండ్ తగ్గిందనడంలో సందేహం లేదు. ‘జెర్సీ’ తర్వాత పెద్ద హీరోలు కూడా తనతో సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు దొరకడం కూడా కష్టమే. కొంచెం స్ట్రగుల్ తప్పేలా లేదు. అతనిప్పుడు ఒరిజినాలిటీ మీద దృష్టిపెట్టాల్సిందే. మళ్ళీ రావా, జెర్సీ తరహాలో బలమైన, తన మార్కు ఉండే కథను తయారు చేసి మెప్పిస్తేనే తర్వాతి సినిమా ముందుకు కదులుతుంది.
This post was last modified on December 6, 2025 8:54 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…