Movie News

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు. తర్వాత కెరీర్లో అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడ్డాడు బాలయ్య. ఐతే ఆరేళ్ల ముందు ఒకే ఏడాది యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక బాలయ్య పుంజుకోవడం కష్టం అనేశారు చాలామంది.

కానీ ‘అఖండ’తో తిరిగి భారీ విజయాన్నందుకున్న బాలయ్య.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా హిట్లు కొడుతూ దూసుకెళ్లారు. వీటి తర్వాత ‘అఖండ’ లాంటి క్రేజీ మూవీకి సీక్వెల్ చేయడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరిగింది. కావాల్సినంత హైప్ వచ్చింది. కెరీర్లో ఈ దశలో బాలయ్య ఇలాంటి హై చూస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు.

అఖండ-2తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని తొడగొట్టి చెబుతూ.. అమెరికా నుంచి అనకాపల్లి వరకు భారీ సంబరాలకు సిద్ధమయ్యారు. నెవర్ బిఫోర్ అన్న స్థాయిలో సెలబ్రేషన్లకు ఏర్పాట్లు జరిగాయి. కానీ వారి ఉత్సాహం మీద నీళ్లు చల్లుతూ ప్రిమియర్స్‌కు బ్రేక్ పడిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపు మొత్తంగా సినిమా రిలీజే ఆగిపోవడంతో నందమూరి అభిమానుల వేదన మామూలుగా లేదు. ఇప్పటిదాకా బాలయ్య కెరీర్లో ఏ సినిమాకూ ఇలాంటి పరిస్థితి రాలేదు.

ఒకే రోజు రెండు భారీ చిత్రాలు (నిప్పురవ్వ, బంగారు బుల్లోడు) సినిమాలను రిలీజ్ చేసి రెంటికీ భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఘన చరిత్ర బాలయ్య సొంతం. అలాంటిది బాలయ్య కెరీర్లో అత్యంత హైప్ ఉన్న సినిమాకు ఇలా జరగడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సంబరాలన్నీ ఆగిపోయి.. అసలు సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియని అయోమయంలో పడిపోడడంతో వారికి నోట మాట రావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన బాలయ్య సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కూడా ఎదుర్కోని బాధ ఇది.

కొన్ని నెలల ముందు పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’కు రిలీజ్ ముంగిట ఇబ్బందులు ఎదురు కావడం, బ్యాడ్ టాక్ వల్ల నిర్మాత, బయ్యర్లకు భారీ నష్టం రావడంతో అప్పుడు నందమూరి అభిమానుల్లో కొందరు నెగెటివ్ పోస్టులు పెట్టి మెగా అభిమానులను ఎద్దేవా చేశారు. ఇప్పుడు వాళ్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అసలే రిలీజ్ ఆగిపోయిన బాధలో ఉన్న వారిని.. యాంటీ ఫ్యాన్స్ మరింతగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో బాలయ్య ప్రమేయం ఏమీ లేకపోయినా, తప్పంతా నిర్మాతలదే అయినా.. ఇలా అవమాన భారాన్ని మోయాల్సి రావడాన్ని నందమూరి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

This post was last modified on December 5, 2025 2:12 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago