రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని హీరో రామ్ తో పాటు టీమ్ మొత్తం అదే కాన్ఫిడెన్స్ చూపించడం తెలిసిందే. అయితే అఖండ 2 తాండవం పెద్ద ఎత్తున రిలీజ్ ఉండటంతో రామ్ చెప్పింది జరగదేమో అనుకున్నారందరూ. కానీ అనూహ్యంగా బాలయ్య సినిమా చివరి నిమిషంలో వాయిదా పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వందలాది స్క్రీన్లకు అత్యవసరంగా ఫీడింగ్ అవసరమయ్యింది. దీంతో వారం చాలనుంకుని తీసేసిన థియేటర్లలో సైతం ఆంధ్రకింగ్ తాలూకాని కొనసాగించబోతున్నట్టు ట్రేడ్ సమాచారం.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు ఆంధ్రకింగ్ తాలూకా ఏ మేరకు పికప్ అందుకుంటుందనేది చూడాలి. అఖండ 2 ఉందనే ఉద్దేశంతో ఇతర నిర్మాతలెవరూ తమ రిలీజులు ప్లాన్ చేసుకోలేదు. పోటీలో ఇబ్బంది అవుతుందని భావించి డిసెంబర్ 12కు వెళ్లిపోయారు. సో ఆడియన్స్ కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. మరీ అనూహ్యంగా కాకపోయినా డీసెంట్ గా పుంజుకున్నా ఆంధ్రకింగ్ తాలూకాకు కొత్త వీకెండ్ కలిసి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను కాస్త కదిలిస్తే మెరుగైన నెంబర్లు చూడొచ్చు. మైత్రి బృందం సరికొత్త ప్రమోషన్ ప్లాన్ లో ఉన్నట్టు అంతర్గతంగా వినిపిస్తోంది.
ఒకరకంగా చెప్పాలంటే ఆంధ్రకింగ్ తాలూకాకి ఇది లాస్ట్ ఛాన్స్. మార్పు చూపించకపోతే ఇక చేతులు ఎత్తేసినట్టే. ఎందుకంటే డిసెంబర్ 12 కొత్త సినిమాలున్నాయి. ఒకవేళ సమస్య పరిష్కారం అయితే అఖండ 2నే రావొచ్చు. ఆపై ఓటిటి స్ట్రీమింగ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకెలాంటి అవకాశాలు ఉండవు. రామ్ అభిమానులు సినిమా ఫలితం పట్ల ఫీలైపోయి టిఎఫ్ఐ ఫెయిల్డ్ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయినా కంటెంట్ బాగుంటే మొదటిసారే బాగా కనెక్ట్ అయ్యేది కానీ ఇప్పుడు హఠాత్తుగా వేరే పరిణామాల వల్ల ఎలా పికప్ అవుతుందన్న కామెంట్లు లేకపోలేదు. చూడాలి మరి ఏం చేస్తుందో.
This post was last modified on December 5, 2025 7:08 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…