బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో హఠాత్తుగా విడుదల ఆగిపోవడం ఒక్క అఖండ 2 విషయంలోనే జరిగింది. గతంలో నిప్పురవ్వ లాంటివి నిర్మాణంలో ఆలస్యం వల్ల ఫ్యాన్స్ ని ఎదురు చూసేలా చేశాయి తప్పించి తీరా విడుదల తేదీ రోజు పోస్ట్ పోన్ కాలేదు. థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన బాలయ్య మద్దతుదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 రావడం లేదనే అధికారిక ధ్రువీకరణ అర్ధరాత్రి వచ్చింది.
వాయిదా వెనుక బోలెడు నేపధ్యముందని ఫిలిం నగర్ టాక్. దూకుడు లాభాలు ఇచ్చినప్పటికీ ఎరోస్ సంస్థతో ఫైనాన్షియల్ లావాదేవీలకు సంబంధించిన క్లియరెన్స్ లు పెండింగ్ పెట్టడంతో పాటు, ఆగడుని డిస్ట్రిబ్యూట్ చేసిన ఎరోస్ కు దాని విషయంలోనే పలు బకాయిలు ఉన్నాయట. వీటికన్నా ముందు 1 నేనొక్కడినే తాలూకు ఇష్యూస్ అలాగే ఉండిపోయాయట. అయితే సర్కారు వారి పాట 14 రీల్స్ సోలో ప్రొడక్షన్ కాకపోవడం వల్లే అది చిక్కుల్లో పడలేదని సమాచారం. ఎట్టకేలకు అఖండ 2 పూర్తయ్యేదాకా ఎదురు చూసిన సదరు ఎరోస్ కంపెనీ సరిగ్గా విడుదల టైంలో చిక్కులు సృష్టించడం ఊహించని పరిణామం.
ఇది ఎంతవరకు నిజమనేది నిర్మాతలు బాహాటంగా ప్రకటిస్తారో లేదో కానీ మొత్తం ఫిలిం నగర్ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అఖండ 2 కోసం రాత్రికి రాత్రి కొందరు పెద్దలు రంగంలోకి దిగి పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికి అవి విఫలమయ్యాయట. ఇరవై ఎనిమిది కోట్లు చాలా పెద్ద మొత్తం కావడం వల్లే సాల్వ్ కాలేదని ఇన్ సైడ్ టాక్. మదరాసు హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చేదాకా అఖండ 2లో కదలిక ఉండకపోవచ్చు. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించుకుని డిసెంబర్ 12, 19 25 ఈ మూడు డేట్లలో ఒకటి లాక్ చేసుకునే పనిలో ప్రొడ్యూసర్లు బిజీగా ఉన్నారట.
This post was last modified on December 5, 2025 7:06 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…