ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా కన్ఫార్మ్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేది ఇంకా క్లారిటీ రాకపోయినా తారక్ నెక్ట్స్ మూవీ ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో అంటూ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో రూమర్లు వినిపిస్తున్నాయి.
‘రామ్ లీల’,‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తీసిన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం అలియా భట్‌తో ‘గంగూభాయ్ కతైవాడి’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో మొదలైన ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో గంగూభాయ్ రావడం ఆలస్యం కావచ్చు.
ఈ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాలీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఓ పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తరహాలో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతుందని, బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నెగిటివ్ రోల్ చేస్తాడని కూడా టాక్.
అయితే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఎన్టీఆర్ మూవీ చేయబోతున్నాడని ఇలాగే వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాగే ఎన్టీఆర్‌తో భన్సాలీ మూవీ కేవలం ఓ రూమర్ అంటూ కొట్టిపాడేస్తున్నారు టాలీవుడ్ జనాలు.
బాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో పనిచేయాలని వెయిట్ చేస్తుంటే… వారిని కాదని భన్సాలీ, ఎన్టీఆర్‌తో మూవీ చేస్తాడా? అని ప్రశ్నిస్తున్నారు బీటౌన్ జనాలు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో వచ్చే క్రేజ్‌ను వాడుకునేందుకే భన్సాలీ ఈ ప్రాజెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
This post was last modified on May 2, 2020 5:34 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…