Movie News

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు ఏదైనా పాత సినిమాల హిట్ సాంగ్స్ కొత్త చిత్రాల్లో వాడుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. మహా అయితే ఒరిజినల్ నిర్మాతను ఫోన్ లో అడగటం ద్వారానో లేదా ఒక లెటర్ పంపడం ద్వారానో ఫార్మాలిటీ పూర్తి చేసేవాళ్ళు. కొందరు అది కూడా లేకుండా నేరుగా వాడేసుకుని సొమ్ము చేసుకున్న దాఖలాలు వందల్లో ఉంటాయి. అల్లరి నరేష్ చేసిన స్పూఫ్ మూవీస్ అన్నీ తవ్వి తీస్తే బోలెడు బయటపడతాయి. కానీ రాజా తర్వాత ఈ వ్యవహారంలో బోలెడు మార్పులొస్తున్నాయి.

ఇకపై దర్శక నిర్మాతలు ఎవరైనా సరే పాత పాటలు వాడుకునే క్రమంలో ముందు కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో విధిగా చెక్ చేసుకుంటున్నారు. మ్యూజిక్ కంపెనీ, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్ ఇలా అన్ని కోణాల్లో విచారణ చేసుకుని ఆ తర్వాత ఎవరిని అడగాలో కనుక్కుని ఆ మేరకు ప్రొసీడ్ అవుతున్నారు. తాజాగా జరిగిన ఉదంతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ సినిమాలకు గాను 50 లక్షలు అవుట్ అఫ్ కోర్ట్ సెటిల్ మెంట్ చేసుకున్నారు నిర్మాత. ఎంతలేదన్నా అరకోటి అంటే భారమే. అదనంగా లాయర్ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. ఇదంతా బడ్జెట్ పరిధిని దాటిన వ్యయం.

ఇళయరాజా వల్ల మిగిలిన సంగీత దర్శకులు అలెర్ట్ అవుతున్నారట. ఇప్పటిదాకా ఇంత సీరియస్ గా ఈ ఇష్యూ మీద దృష్టి పెట్టిన వాళ్ళు లేరు. రెహమాన్, కీరవాణి, కోటి, దేవా తదితరులు రాజా లాగా న్యాయస్థానాలకు వెళ్లడం లేదు కానీ తమ స్వంత పాటల కాపీ రైట్స్ ఎవరైనా వాడుకుంటే అసలు నిర్మాతల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఏదైతేనేం ఎవరో ఒకరికి రాజా చేసిన యుద్ధం వరంగా మారుతోంది. 1996లో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్ వాడుకోవాలంటే ఒక తెలుగు నిర్మాతను మ్యూజిక్ కంపెనీ అడిగిన మొత్తం 25 లక్షలట. అర్ధమయ్యిందా ఇళయరాజా ప్రభావం ఏ స్థాయిలో పడిందో.

This post was last modified on December 4, 2025 2:46 pm

Share

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

19 minutes ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

21 minutes ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

3 hours ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

6 hours ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

9 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

10 hours ago